హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.
హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. కానీ అక్కడ కూడా అంతంత మాత్రంగానే ఆఫర్స్ వస్తున్నాయి.
26
రకుల్ చివరగా తెలుగులో మన్మథుడు 2, చెక్, కొండపొలం లాంటి చిత్రాల్లో నటించింది. ఈ మూడు చిత్రాలు కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. తాజాగా రకుల్ తనకు ఆఫర్స్ తగ్గడంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. నాకు సౌత్ లో అద్భుతంగా ఆఫర్స్ వచ్చేవి. టాలీవుడ్ నన్ను స్టార్ ని చేసింది.
36
manmadhudu2
నా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఒక సీనియర్ హీరోతో నటించిన చిత్రంలో ముద్దు సీన్లు ఆడియన్స్ కి నచ్చలేదు. ఆ సన్నివేశాలని వారు యాక్సెప్ట్ చేయలేదు. ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఫలితంగా నాకు ఒక్కసారిగా సౌత్ లో ఆఫర్స్ తగ్గాయి అని రకుల్ ప్రీత్ సింగ్ వాపోయింది.
46
రకుల్ పేర్కొన్న ఆ సీనియర్ హీరో నాగార్జునే అని.. ఆ చిత్రం మన్మథుడు 2 అని నెటిజన్లు భావిస్తున్నారు. రకుల్ సౌత్ లో కిస్సింగ్ సీన్స్ లో నటించిన సీనియర్ హీరో చిత్రం మన్మథుడు 2 మాత్రమే. బాలీవుడ్ లో కూడా రకుల్ అజయ్ దేవగన్ లాంటి సీనియర్ హీరోతో రొమాంటిక్ గా నటించింది. కానీ ఆమె సౌత్ గురించి మాట్లాడింది కాబట్టి రకుల్ చేసిన వ్యాఖ్యలు నాగార్జునని ఉద్దేశించే అని అంటున్నారు.
56
మన్మథుడు 2లో రకుల్ ముద్దు సీన్లు, స్మోకింగ్ సీన్లలో బోల్డ్ గా నటించింది. మన్మథుడు 2 చిత్రం విడుదలయ్యాక బాగా ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
66
కెరటం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్.. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, ధృవ, సరైనోడు లాంటి హిట్ చిత్రాలతో రకుల్ స్టార్ హీరోయిన్ గా మారింది. రవితేజ, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, మహేష్ ఇలా స్టార్ హీరోల సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది.