ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీకి కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో పాయల్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది.