Sreemukhi: కంప్లీట్ బ్లూ డ్రెస్ లో శ్రీముఖి.. మెస్మరైజింగ్ ఫోజుల్లో రాములమ్మ అందాలు అదుర్స్

First Published Dec 5, 2021, 4:23 PM IST

తాను ఎక్కడ ఉన్నా రచ్చ రచ్చ చేస్తూ అందరిలో జోష్ నింపుతుంది శ్రీముఖి. టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది.

తాను ఎక్కడ ఉన్నా రచ్చ రచ్చ చేస్తూ అందరిలో జోష్ నింపుతుంది శ్రీముఖి. టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. 

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. 

 ఇక బిగ్ బాస్ సీజన్ 3లో Sreemukhi, రాహుల్ సిప్లిగంజ్ మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. 

శ్రీముఖి ఇటీవల 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో సింగర్ మనో, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటించారు. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫోటోస్ షేర్ చేసింది. కంప్లీట్ బ్లూ డ్రెస్ లో శ్రీముఖి మెరిసింది. విభిన్నంగా ఉన్న ఈ డ్రెస్ లో చందమామకు బ్లూ డ్రెస్ తొడిగినట్లుగా వెలిగిపోతోంది. 

శ్రీముఖి వయ్యారంగా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి చంద్రబింబంలా వెలిగిపోతూ ఇచ్చిన ఫోజులు కేక పెట్టించే విధంగా ఉన్నాయి. శ్రీముఖి ఎలాంటి డ్రెస్ లో మెరిసినా ఆమె అందాలకు నెటిజన్లు ఫిదా అవుతూనే ఉంటారు. Also Read: బన్నీతో మిస్సైనా పవన్ మూవీలో జాక్ పాట్ కొట్టేసింది

click me!