క్రేజీ డేట్‌కి `ఆర్‌ఆర్‌ఆర్‌` అంటూ ట్రెండింగ్‌.. పవన్‌, ప్రభాస్‌, మహేష్‌లో గుబులు.. గందరగోళంలో టాలీవుడ్‌?

Published : Sep 28, 2021, 06:03 PM IST

తెలుగులోనే కాదు, ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR movie). అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. తాజాగా ఓ క్రేజీ డేట్‌(RRR release date) ఇప్పుడు నెట్టింట ట్రెండ్‌ అవుతుంది. 

PREV
17
క్రేజీ డేట్‌కి `ఆర్‌ఆర్‌ఆర్‌` అంటూ ట్రెండింగ్‌.. పవన్‌, ప్రభాస్‌, మహేష్‌లో గుబులు.. గందరగోళంలో టాలీవుడ్‌?

కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆడియెన్స్ థియేటర్‌కి వచ్చేందుకు వెనకాడుతున్నారు. కానీ ఇటీవల విడుదలైన `లవ్‌ స్టోరి` చిత్రం థియేటర్లని నింపేసింది. చాలా వరకు థియేటర్లు హౌజ్‌ ఫుల్‌ అయ్యాయి. సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకునేలా చేసింది. నిర్మాతల్లో ఆశలు చిగురించింది. దీంతో వరుసగా సినిమాలు విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. ఇందులో ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌` కూడా ఉండటం విశేషం. 
 

27

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం రూపొందుతుంది. అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోన్న ఈ సినిమా అక్టోబర్‌ 13న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌, థియేటర్లు ఇండియాలో పూర్తి స్థాయిలో ఓపెన్‌ కాకపోవడం వల్ల వాయిదా వేశారు. అంతా బాగున్న సమయంలో రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తామని యూనిట్‌ ప్రకటించారు. 

37
rrr movie

తాజా సమాచారం మేరకు `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాని సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్‌ చేస్తుందట జక్కన్న టీమ్‌. ఆ లోపు ఇతర రాష్ట్రాల్లోనూ థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ అయ్యే అవకాశాలుండటం, కరోనా కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో సంక్రాంతిని ఫిక్స్ చేసినట్టు ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జనవరి 12న ఈ సినిమాని విడుదల చేయాలని నిర్ణయించారని, త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని  `ఆర్‌ఆర్‌ఆర్‌`కి సంబంధించిన ఓ వార్త ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది.

47

`ఆర్‌ఆర్‌ఆర్‌` సంక్రాంతి బరిలో అనే ఆలోచన ఇప్పుడు టాలీవుడ్‌ని గందరగోళంలో పడేసింది. ఎందుకంటే ఇప్పటికే సంక్రాంతి బరిలో ప్రభాస్‌ `రాధేశ్యామ్‌`, పవన్‌ కళ్యాణ్‌` భీమ్లా నాయక్‌`, మహేష్‌ `సర్కారు వారి పాట`, వెంకటేష్‌ `ఎఫ్‌3` ఉన్నాయి. వీటికి పోటీగా `ఆర్‌ఆర్‌ఆర్‌` వచ్చే ఛాన్స్ తక్కువ. దీంతో సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలతో సంప్రదింపులు జరుపుతున్నారనట `ఆర్‌ఆర్‌ఆర్‌` మేకర్స్. సంక్రాంతి అనేదితెలుగు ఇండస్ట్రీలో సినిమాల రిలీజ్‌కి హాట్‌ స్పాట్‌. భారీ కలెక్షన్లు రావాలంటే సంక్రాంతి బెస్ట్ సీజన్. ఈ సీజన్‌ని వదులుకోవాలని ఏ నిర్మాత చూడడు. 
 

57

మరి `ఆర్‌ఆర్‌ఆర్‌` రావాలంటే ఈ సినిమాలు కచ్చితంగా వాయిదా పడాల్సిందే. కనీసం రెండు సినిమాలైనా పోస్ట్ పోన్‌ చేసుకోవాలి. లేదంటే బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల యుద్ధం తప్పడు. దాదాపు నాలుగున్న వందల కోట్లతో రూపొందిన `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆ ఎఫెక్ట్ పడుతుంది. అందుకోసం ఇప్పుడు ప్రభాస్‌, మహేష్‌ సినిమాలతో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్‌. అదే సమయంలో ఈ హీరోలను ఇరకాటంలో పెట్టారని చెప్పొచ్చు. దీంతో పవన్‌, మహేష్‌, ప్రభాస్‌ నిర్మాతలకు గుబులు పట్టుకుందనే టాక్‌ సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. 
 

67
rrr

సంక్రాంతి సీజన్‌ పోయిందంటే ఈ పెద్ద సినిమాలకు సమ్మరే బెస్ట్ ఆప్షన్‌. అప్పటి వరకు నిర్మాతలు ఆ బడ్జెట్‌ భారాన్ని భరిస్తారా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అదే సమయంలో ఒక్క `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా మొత్తం టాలీవుడ్‌ని గందరగోళంలో పడేస్తుందనే కామెంట్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరి `ఆర్‌ఆర్‌ఆర్‌` కోసం పవన్‌, మహేష్‌, ప్రభాస్‌లో ఎవరు వెనక్కి తగ్గుతారు? ఎవరు పోటీ పడతారనేది చూడాలి. 

77

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `భీమ్లా నాయక్‌` సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మహేష్‌ నటిస్తున్న `సర్కారు వారి పాట` జనవరి 13న రిలీజ్‌ కాబోతుంది. అలాగే ప్రభాస్‌ నటిస్తున్న `రాధేశ్యామ్‌` జనవరి 14 రిలీజ్‌ కాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అలాగే వెంకీ `ఎఫ్‌3` జనవరి 15న రిలీజ్‌కి ప్లాన్‌ చేశారని టాక్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories