గెలుపు మాదే, ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ వైపు ఉంటారా.. మంచు విష్ణు నామినేషన్ ఫోటోస్

pratap reddy   | Asianet News
Published : Sep 28, 2021, 05:19 PM IST

టాలీవుడ్ లో మా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతుంటాయి. విమర్శలకు తావు లేకుండా ఎన్నిక ప్రశాంతంగా జరగాలని ఇండస్ట్రీ పెద్దలంతా కోరుకుంటారు.

PREV
110
గెలుపు మాదే, ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ వైపు ఉంటారా.. మంచు విష్ణు నామినేషన్ ఫోటోస్

టాలీవుడ్ లో మా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతుంటాయి. విమర్శలకు తావు లేకుండా ఎన్నిక ప్రశాంతంగా జరగాలని ఇండస్ట్రీ పెద్దలంతా కోరుకుంటారు. కానీ అది సాధ్యపడడం లేదు. విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. 

210

అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు ప్యానల్, ప్రకాష్ రాజ్ ప్యానల్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో ఎవరు విజయం సాధిస్తారనేది ముందుగా పసిగట్టలేకున్నారు. 

310

నామినేషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో మంచు విష్ణు తన ప్యానల్ తో ర్యాలీగా కలసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. విష్ణు ప్యానల్ లో సీనియర్ కమెడియన్ బాబు మోహన్,  పృథ్వి రాజ్, కరాటే కళ్యాణి, రఘుబాబు, శివబాలాజీ లాంటి ప్రముఖ నటులు ఉన్నారు. 

410

మోహన్ బాబు తనయుడిగా మంచు విష్ణుకి ఇండస్ట్రీ ప్రముఖులందరితో పరిచయాలు ఉన్నాయి. ఇండస్ట్రీలోని కొందరు సీనియర్ విష్ణుకి మద్దతు ఇస్తున్నట్లు వినికిడి. అదే విధంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ కూడా బలంగా ఉంది. ప్రకాష్ రాజ్ కు ఓ వర్గం నుంచి బలమైన సపోర్ట్ ఉన్నట్లు టాక్. 

510

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కామెంట్స్, ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు వీటన్నింటితో మా ఎన్నికపై ఆసక్తి పెరిగింది. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

610

పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో తాను ఏకీభవించను అని నామినేషన్ అనంతరం మంచు విష్ణు తెలిపాడు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇండస్ట్రీకి సంబంధం లేదని సినీ పెద్దలు నిర్ణయించి ఫిలిం ఛాంబర్ తరుపున లేఖ విడుదల చేశారు. కాబట్టి నేను ఇండస్ట్రీ పెద్దల తరుపున నిలబడతాను. పవన్ వ్యాఖ్యలని సమర్థించను అని విష్ణు తెలిపాడు. 

710

ఇక ప్రకాష్ రాజ్ తన వైఖరిని బయట పెట్టాలని.. ఆయన ఇండస్ట్రీ వైపున ఉంటారా లేక పవన్ కళ్యాణ్ వైపునా అని విష్ణు ప్రశ్నించాడు. మా ఎన్నికల్లో తమ ప్యానల్ విజయం సాధిస్తుంది అని విష్ణు ధీమా వ్యక్తం చేశారు. 

810

పవన్ కళ్యాణ్ విమర్శల తర్వాత తెలుగు ఫిలిం ఛాంబర్ లేఖ విడుదల చేస్తూ.. ప్రభుత్వాల మద్దతు లేకుండా చిత్ర పరిశ్రమ మనుగడ కష్టం అని పేర్కొన్నారు. 

910

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఇంకా స్పందించలేదు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో జీవిత రాజశేఖర్, హేమ, బెనర్జీ, శ్రీకాంత్, నాగినీడు లాంటి ప్రముఖ నటులు ఉన్నారు. 

 

1010

ఇదిలా ఉండగా బండ్ల గణేష్ ఒంటరిగా జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీలో నిలిచారు. మొదట ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపిన గణేష్ ఆ తర్వాత విభేదాలతో బయటకు వచ్చారు. 

 

click me!

Recommended Stories