అరియానా యాంకర్‌గా అందరికి తెలుసు. కానీ బిగ్‌బాస్4తో ఆడియెన్స్ కి దగ్గరైంది. విపరీతమైన ఫాలోయింగ్‌ని, గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోలో ఆమె చేసిన సందడి, హంగామా అంతా ఇంతా కాదు. కొన్న సందర్భాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ని పీక్‌లోకి తీసుకెళ్లింది.
అవినాష్‌తో హౌజ్‌లో రొమాన్స్ , కెమిస్ట్రీ పండిస్తూ ఆడియెన్స్ కి కావాల్సిన వినోదాన్ని పంచింది అరియానా. బిగ్‌బాస్‌లో టాప్ 5లోకి వెళ్లి వాహ్ అనిపించుకుంది. అందరి చేత ప్రశంసలందుకుంది. బిగ్‌బాస్ తర్వాత వరుసగా పలు షోస్‌లో పాల్గొని తమ సందడిని రెట్టింపు చేసింది.
`కామెడీ స్టార్స్`, `క్యాష్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`, `సిక్త్స్ సెన్స్` వంటి షోస్‌లోనూ హంగామా చేసింది అరియానా. ఇప్పుడు బిగ్‌బాస్5లోనూ సందడి చేస్తుంది. `బిగ్‌బాస్ బజ్` షోకి యాంకర్‌గా చేస్తుంది.
ఇప్పటికే ఈ భామ ఎలిమినేట్ అయిన సరయు, ఉమాదేవి, లాహరిలను ఇంటర్వ్యూ చేసింది. వారిని ఆసక్తికర ప్రశ్నలడిగి ఆకట్టుకుంది. దీంతోపాటు హౌజ్‌లో గేమ్ ఆడితేనే ఆడియెన్స్ ఓట్లు వేస్తారని తాజాగా పరోక్షంగా లహరికి చురకలంటించింది అరియానా.
మరోవైపు తాజాగా పర్పుల్ కలర్ స్లీవ్ లెస్ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. హాట్‌పోజులతో వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. కొత్త లుక్లో అరియానాని చూస్తుంటే మతిపోతుందంటున్నారు నెటిజన్లు.
ఓ వైపు జోరు వాన పడుతుంటే, అరియానా మాత్రం సోషల్ మీడియా ద్వారా తన ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం అరియానా గ్లామర్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే అరియానా ఇటీవల కొత్త కారు కొనుగోలు చేసింది. కియా మోడల్ కారుని ఆమె కొన్నది. ఈ సందర్భంగా ఫోటోలను అభిమానులతో పంచుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ సందర్బంగా ఓ బెస్ట్ కొటేషన్ పోస్ట్ చేసింది అరియానా.
బాస్‌గా ఎదగాలని పేర్కొంది. నిత్యం బిజీగా ఉండాలని, చాలా హార్డ్ వర్క్ చేయాలని, దీంతో ఆటో మెటిక్ గా డబ్బు వస్తుందని పేర్కొంది అరియానా. ఈ అమ్మడు పంచుకున్న ఈ పోస్ట్ కి అభిమానులు సపోర్ట్ చేస్తూ బాగా చెప్పావని,సింప్లీ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.