పాలరాతి బొమ్మలా అట్రాక్ట్ చేస్తున్న నిధి అగర్వాల్.. పరువాల విందు చేస్తూ.. మైమరిపించేలా పోజులు

Published : May 13, 2022, 01:23 PM IST

తెలుగు హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది. తాజాగా నిధి పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  

PREV
16
పాలరాతి బొమ్మలా అట్రాక్ట్ చేస్తున్న నిధి అగర్వాల్.. పరువాల విందు చేస్తూ.. మైమరిపించేలా పోజులు

నిధి అగర్వాల్ అచ్చమైన తెలుగు హీరోయిన్. పుట్టింది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాలోనే అయినా.. పెరిగింది మాత్రం బెంగళూరులో. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల ఈ హీరోయిన్ బెల్లి డ్యాన్స్, కథక్, బాలెట్ లో శిక్షణ పొందింది.  అయితే నిధి ఇప్పుడిప్పుడే సినిమాల జోరు పెంచుతోంది.
 

26

2017లో డ్యాన్స్ బేస్డ్ గా వచ్చిన హిందీ చిత్రం ‘మున్నా మైఖేల్’లో యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఈ సినిమాతోనే సినీ రంగ ప్రవేశం చేసింది. తన తొలిచిత్రంతోనే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది నిధి. కానీ  హిందీలో తను చేసిన తొలి, చివరి సినిమా అదే.
 

36

ఆ తర్వాత టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. సావ్యసాచీ, మిస్టర్ మజ్ను చిత్రాల్లో అక్కినేని హీరోల సరసన నటించింది. ఈ చిత్రాల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. నిధి నటనకు మాత్రం మంచి మార్కులే పడుతూ వచ్చాయి. గ్లామర్ పరంగా, నటన పరంగా నిధి ఒకే అనిపించుకోవడంతో ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి.
 

46

ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్  పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో హీరోయిన్ నటించింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడంతో నిధి పేమ్ కూడా అంతకంతకూ పెరిగింది. మరోవైపు  సినిమాలో నిధి పాత్ర కూడా ఆడియెన్స్ ను మెప్పించింది. దీంతో నిధికి మంచి బ్రేక్ పడింది.
 

56

చివరిగా ‘హీరో’చిత్రంలో  యంగ్ హీరో అశోక్ గల్లా సరసన నటించింది. ఈ చిత్రం కూడా నిధికి మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బంపర్ ఆఫర్ అందుకున్న నిధి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా ‘హరి హర వీరమల్లు’లో నటిస్తోంది. ఈ చిత్రం నిధి కేరీర్ కు మైలురాయిగా మారనున్నట్టు తెలుస్తోంది.

66

మరోవైపు ఇటు సోషల్ మీడియాలోనూ నిధి సమయం ఉన్నప్పుడల్లా తన అభిమానులను పలకరిస్తూనే ఉంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో గ్లామర్ ఒళకబోస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. పిక్ స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో స్టన్నింగ్ గా కనిపిస్తోంది. పాలరాతి బొమ్మలా మెరిసిపోతోంది. దీంతో నెటిజన్లు లైకులు, కామెంట్లతో నిధి అందాన్ని పొగుడుతున్నారు.  
 

Read more Photos on
click me!

Recommended Stories