నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది. కంగనా రనౌత్ వరుసగా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వివాదాల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా కంగనా రనౌత్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.