Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోయిన్ దేవయాని కూతురిని చూశారా? అందంలో అమ్మ పోలికే

Published : Jan 13, 2026, 08:01 AM IST

Pawan Kalyan: సుస్వాగతం సినిమాలో పవన్  కళ్యాణ్ తో కలిసి నటించింది దేవయాని. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టింది. పవన్ కళ్యాణ్ క స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఆ నటి దేవయాని కూతురు ఇనియా ఏం చేస్తుందో తెలుసా?

PREV
14
పవన్ కళ్యాణ్ హీరోయిన్ దేవయాని

పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా దేవయానికి ఎంతో గుర్తింపు ఉంది. సుస్వాగతం సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే పెద్ద హిట్. అప్పటినుంచి అతను స్టార్ హీరోగా మారిపోయాడు. దేవయాని ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం కొన్ని టీవీ షోలలో అలాగే సినిమాల్లో సహాయ నటిగా కనిపిస్తోంది. ఆమె కూతురు ఇనియా. ఈమె సింగర్ గా ఎంట్రీ ఇచ్చింది.

24
మంచి సింగర్ ఇనియా

ఇనియా రాజకుమారన్.. నటి దేవయాని, దర్శకుడు రాజకుమారన్ కూతురు. ఇనియా తల్లిలాగే ఎంతో అందంగా ఉంటుంది. అయితే హీరోయిన్ గా ఆమె ఎంట్రీ ఇవ్వదలుచుకోలేదు. తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుంది. ఆమె మంచి సింగర్. అందుకే జీ తమిళ్ లో వచ్చే సరిగమపలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. టాప్ సెవెన్ గా నిలిచింది. కానీ విజేత కాలేకపోయింది. ఎంతోమంది మాత్రంం తన గొంతుకు అభిమానులైపోయారు.

34
సోషల్ మీడియాలో యాక్టివ్

ఇటీవలే ఇనియా తన 20వ పుట్టినరోజున నిర్వహించుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె సింగర్‌గానే కొనసాగాలనుకుంటున్నట్టు చాలా సార్లు చెప్పింది. ఇక దేవయాని 2001లోనే రాజ్ కుమార్ అనే డైరెక్టర్ని పెళ్లి చేసుకొని కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత టీచర్ గా పని చేసింది. మళ్ళీ సినిమాల్లో అవకాశాలు రావడంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇప్పుడు తల్లి పాత్రలు చేస్తోంది. జనతా గ్యారేజ్ లో కూడా ఆమె తల్లి పాత్రే చేసింది.

44
హీరోయిన్ అవ్వను

దేవయానికి ఇద్దరు కూతుర్లు. ఇనియా కుమారన్, ప్రియాంక కుమారన్. ఇనియా మంచి సింగర్ గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఎన్నో సింగింగ్ షోలను కూడా నిర్వహిస్తోంది. ఆమెకు తీయని గొంతు దేవుడిచ్చిన వరం. తల్లిలాగా వారసత్వంగా హీరోయిన్ అవ్వాలనే కోరిక లేదని, మంచి సింగర్ గా పేరు తెచ్చుకోవాలని ఉందని ఇనియా ఎన్నోసార్లు చెప్పింది. సరేగమప సీనియర్స్ సీజన్ 5లో ఆమె పాటలతో అదరగొట్టింది. దేవయాని కూతురు పార్టిసిపేట్ చేస్తుందని తెలియడంతో ఈ ప్రోగ్రామ్ కు క్రేజ్ బాగా పెరిగిపోయింది. అందించారు

Read more Photos on
click me!

Recommended Stories