సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు సినిమా.. త్వరలో ఓటీటీ ఆడియన్స్ ను కూడా అలరించబోతోంది. ఇంతకీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ?
ఈ సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆయన నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా తాజాగాప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైం అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది. మొదటి ఆట నుంచే చిరంజీవి సినిమాకు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో దర్శకుడితో పాటు మూవీ టీమ్, మెగా అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు.
24
మన శంకర వరప్రసాద్ గారులో స్టార్ కాస్ట్..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేకమైన అతిథి పాత్రలో కనిపించారు. చిరంజీవి జంటగా నయనతార, క్యాథరిన్ త్రెసా నటించగా.. కీలక పాత్రల్లో అభినవ్ గోమఠం, హర్షవర్ధన్, సచిన్ ఖేద్కర్ తదితరులు నటించారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో.. ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి.. మెగా అభిమానుల కోసం ఈసినిమాను అద్భుతంగా తీర్చి దిద్దారు. అనుకున్న విధంగానే అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది మన శంకర వరప్రసాద్ గారు మూవీ. ప్రీమియర్స్ నుంచే సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోవడంతో.. మూవీటీమ్ పండగ చేసుకుంటోంది.
34
ఓటీటీలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఎప్పుడు?
కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో.. సంక్రాంతి సీజన్‌లో ఫుల్ మీల్స్ లాంటి సినిమా రావడంతో.. ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. ఇక థియేటర్ లో ఎలాగో హిట్ టాక్ తెచ్చుకున్న మన శంకర వరప్రసాద్ గారు.. ఓటీటీలో కూడా ఆడియన్స్ ను అలరించే టైమ్ ఎంతో దూరంలో లేదు. ఈసినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సబంధించిన అప్ డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకోగా, శాటిలైట్ హక్కులను జీ తెలుగు కొనుగోలు చేసింది. ఈమూవీ మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఫిబ్రవరిలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈమధ్య కాలంలో సినిమాలు థియేటర్ రిలీజ్ అవ్వడానికి ముందే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కు సబంధించిన విషయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్‌ను పరిశీలిస్తే, పెద్ద సినిమాలు కూడా థియేటర్లలో విడుదలైన30 రోజుల లోపే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తున్నాయి. అదే విధంగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓటీటీలో ఈసినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.