రోజుకు 1 కోటి వసూలు చేసే హీరోయిన్, పెళ్ళై పిల్లలు ఉన్నా తగ్గని డిమాండ్, ఎవరా బ్యూటీ..?

First Published | Dec 28, 2024, 3:42 PM IST

గతంలో హీరోలకు మాత్రమే డిమాండ్ ఎక్కువగా ఉండేది. కాని ఇప్పుడు హీరోయిన్లు కూడా రెచ్చిపోయి డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఒక రోజుకు కోటి రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరో మీకు తెలుసా..? 
 

ఒకప్పుడు హీరోయిన్లకు  పెద్దగా రెమ్యునరేషన్లు ఉండేవి కాదు. మరీ ముఖ్యంగా పదిపదిహేనేళ్ల క్రితం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ లకు అయితే అసలు సినిమాల్లో నటించే స్కోప్ ఉండేది కాదు. ఇక రెమ్యునరేషన్ కూడా కోటి దాటి ఉండేది కాదు.. సినిమా మొత్తానికి హీరోలు కోట్లు తీసుకుంటుంటే.. హీరోయిన్ల రెమ్యునరేషన్ మాత్రం లక్షల్లోనే ఉండేది.

 అయితే ఇప్పుడు హీరోయిన్ల పరిస్థితి మారిపోయింది. వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. కోట్లకు కోట్లు వసూలు చేస్తున్నారు. నయనతార, త్రిష లాంటి వారు అయితే సీనియర్లు అయ్యారు. 40 ఏళ్ళు దాటినా కూడా 10 నుంచి 15 కోట్ల వరకూ వసూలు చస్తున్నారట. ఇక ఈక్రమంలోనే ఓ హీరోయిన్ అయితే రోజుకు కోటి అడిగేస్తోందట.  ఆమె 10 రోజులు షూటింగ్ చేసినందుకు దాదాపు 9 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుందట. 


డిస్కౌంట్ ఇచ్చిందో ఏమో తెలియదు కాని.. దాదాపు ఒక రోజు షూటింగ్ కు కోటి తీసుకుంటుదట ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆలియా భట్. అవును ఆలియా భట్ వస్సులో చిన్నదే కాని పెళ్ళై ఓ పాప కూడా ఉంది. బాలీవుడ్ యంగ్ హీరో రణ్ బీర్ కపూర్ ను పెళ్లాడింది బ్యూటీ. పెళ్లి తరువాత కూడా ఇద్దరు ఎవరి పని వారు హ్యాపీగా చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆలియా భట్ అయితే.. బ్యటీ విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు. 

మోడల్ గా కూడా కొనసాగుతోంది ఆలియా. సినిమాలు కూడా వరుసగా ఒప్పేసుకుంటుంది. భారీగా డిమాండ్ చేస్తోంది కూడా.  అలియా భట్ కి బాలీవుడ్ లో మామూలు క్రేజ్ లేదు. జాన్వీ కపూర్ లాంటి హీరోయిన్లు ఎంత కష్టపడ్డా రాని క్రేజ్.. ఆలియా భట్ కు పద్దగా కష్టపడకపోయినా వచ్చేస్తోంది. ఆలియా భట్ అంటే ఒక బ్రాండ్ లా తయారయ్యింది. మరీ ముఖ్యంగా గంగూబాయ్ సినిమా టైమ్ నుంచి ఆలియా క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. 

ఇక ఈమె పేరుని చూసి థియేటర్ కి  వచ్చే ఆడియన్స్ లక్షల్లో ఉంటారు. అందుకే ఇంత డిమాండ్ చేస్తున్నట్టంది ఆలియా భట్. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఆలియా భట్ ఈ రెమ్యునరేషన్ తీసుకున్నది బాలీవుడ్ సినిమాకు కాదట. టాలీవుడ్ సినిమాకట. అది కూడా ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఇంత వసూలు చేసిందట. 
 

ఈ సినిమాలో ఆమె రామ్ చరణ్ కి జోడిగా సీత పాత్రలో నటించింది. సినిమాలో ఈమె కనిపించేది చాలా తక్కువ టైమ్ అయినా సరే సినిమాను మలుపుతిప్పే పాత్రలో నటించింది ఆలియా. అయితే ఈ కొద్దిసేపు పాత్రకోసం ఆమె 6 రోజులు కాల్షిట్స్ ఇచ్చిందట. అంతే కాదు మరో నాలుగు రోజులు ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ జెండా పాట కోసం ఇచ్చిందట. ఇక 10 రోజులకు గాను ఆమె 9 కోట్ల వసూలు చేసిందని సమాచారం. 
 

ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది ఆలియా భట్. సౌత్ నుంచి మరే సినిమాను ఆమె ఒకే చేయలేదు. ఇక్కడ ప్రస్తుతం జాన్వీ కపూర్ హవా నడుస్తోంది. రీసెంట్ గా దేవర సినిమాతో సందడి చేసిన జాన్వీ.. రామ్ చరణ్ సినిమాలో కూడా నటిస్తోంది. మరి ఆలియా భట్ ముందు ముందు టాలీవుడ్ సినిమాలు చేస్తుందా లేదా అనేది చూడాలి మరి. 

Latest Videos

click me!