Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు నందమూరి బాలకృష్ణ అంటే ఎంతో గౌరవం. అయితే, బాలయ్య నటించిన ఒక సినిమాను పవన్ కళ్యాణ్ ఏకంగా 100 సార్లు చూశారని టాక్. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరు హీరోల స్వభావం దాదాపు ఒకేలా ఉంటుంది. ఇద్దరూ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. మనసులో ఏముంటే అది ముఖం మీద చెప్పేస్తుంటారు. అందుకే ఈ ఇద్దరు హీరోల మధ్య ఒకరిపై ఒకరికి ఎంతో గౌరవం ఉంది.
25
వంద సార్లు చూశారని..
అయితే, పవన్ కళ్యాణ్‌కు బాలయ్య సినిమాలు అంటే చాలా ఇష్టమని, అందులోనూ ఒక సినిమాను ఆయన వంద సార్లు చూశారని మీకు తెలుసా. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
35
సమరసింహారెడ్డిపై పవన్ కళ్యాణ్ ఇష్టం..
బి. గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన పవర్‌ఫుల్ ఫ్యాక్షన్ చిత్రం 'సమరసింహారెడ్డి'. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమా పవన్ కళ్యాణ్‌కు ఫేవరెట్ మూవీనట. ఆ చిత్రంలో బాలయ్య బాబు నటన, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఎపిసోడ్స్ పవన్ కళ్యాణ్‌ను బాగా ఆకట్టుకున్నాయని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ తన సన్నిహితులతో 'సమరసింహారెడ్డి' సినిమాను తాను దాదాపు 100 సార్లు చూశానని తరచుగా చెబుతుంటారట. ఒకే సినిమాను ఇన్నిసార్లు చూడటం అంటే మామూలు విషయం కాదు. బాలయ్య బాబు తన పూర్తి స్థాయి నటనను ఆ సినిమాలో ప్రదర్శించారని, ఆయన మేనరిజమ్స్ తనను బాగా ఇన్ స్పైర్ చేశాయని పవన్ కళ్యాణ్ తరచూ చెప్పేవారట.
55
అభిమానానికి నిదర్శనం
పవన్ కళ్యాణ్‌కు బాలకృష్ణ సినిమాలపై ఉన్న ఈ ఇష్టం, ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనం అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసులో కూడా బాలయ్య బాబు వరుస విజయాలతో దూసుకుపోతుంటే, పవన్ కళ్యాణ్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరో సినిమాను ఇన్ని సార్లు చూడటం అనేది టాలీవుడ్‌లో ఒక అరుదైన పరిణామంగా చెప్పుకోవచ్చునని అభిమానులు చెబుతున్నారు.