దివంగత దర్శకుడు సురేశ్ సంగయ్య కూతుళ్ల చదువు ఖర్చుల కోసం నటుడు యోగి బాబు ఆర్థిక సాయం చేశారు. 'ఒరు కిడాయిన్ కరుణై మను', 'సత్య సోధనై' వంటి సినిమాలతో గ్రామీణ జీవితాలను సహజంగా చూపించిన దర్శకుడు సురేశ్ సంగయ్య. కొన్ని నెలల క్రితం ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన చనిపోవడానికి ముందు తీసిన 'కెనత్త కాణోం' సినిమా త్వరలో విడుదల కానుంది.
25
యోగి బాబు హీరోగా
దివంగత దర్శకుడు సురేశ్ సంగయ్య డైరెక్ట్ చేసిన సినిమా 'కెనత్త కాణోం'. జియో హాట్‌స్టార్ సమర్పణలో ఆర్. రమేశ్ బాబు, జగన్ భాస్కరన్ దీన్ని నిర్మించారు. యోగి బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో లవ్లిన్ చంద్రశేఖర్, రామకృష్ణన్, రేచల్ రెబెకా, జార్జ్ మరియం, మొట్టై రాజేంద్రన్, కవితా భారతి, కలైపాండియన్, హలో కందసామి తదితరులు నటించారు. ఈ చిత్రానికి నివాస్ కే ప్రసన్న సంగీతం అందించారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది.
35
నన్నే హీరోగా పెట్టి..
దర్శకుడు సురేశ్ సంగయ్య నాకు 'కాక్కా ముట్టై' సినిమా టైం నుంచే తెలుసు. 'ఒరు కిడాయిన్ కరుణై మను'లో నన్ను నటింపజేయాలని ఆయన ప్లాన్ చేశారు. కానీ అప్పుడు నేను కొంచెం వెనకాడాను. హీరో కాకపోయినా, మరో పాత్రలోనైనా నటించమన్నారు. కానీ డేట్స్ సమస్య, ఇతర సినిమాల వల్ల అది కుదరలేదు. ఆ తర్వాత నన్నే హీరోగా పెట్టి సినిమా తీయాలని ఆయన ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు.
ఇది నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. మనం ఒక మంచి దర్శకుడిని కోల్పోయాం. కానీ ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు. బిడ్డ పుట్టిన తర్వాతే ఆయన చనిపోయారు. నేను ముందే చెప్పినట్లు, ఆ పాప చదువుకు నేను సాయం చేస్తాను. స్టేజి ఎక్కి దేవుడు లేడని చెప్పడం కంటే, కొండెక్కి దేవుడిని మొక్కుకుంటాను. నేను నమ్మే మురుగన్ దయతో ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను' అని యోగి బాబు అన్నారు.
55
సురేశ్ ఇద్దరు పిల్లల చదువు కోసం
సురేశ్ ఇద్దరు పిల్లల చదువు ఖర్చుల కోసం యోగి బాబు చెక్కు అందించారు. అయితే, ఆ చెక్కులో ఎంత మొత్తం ఉందో బయటకు చెప్పవద్దని ఆయన కోరినట్లు సమాచారం.