పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న రిలీజ్ అవుతోంది. తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. హరీష్ శంకర్ పదునైన డైలాగులు, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ తో ట్రైలర్ అదిరిపోయింది అనే చెప్పాలి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్, పవన్ కాంబోలో వస్తున్న చిత్రం ఇదే. దీనితో ఉస్తాద్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మార్చి 19న ఉగాది కానుకగా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.
25
ఉస్తాద్ ట్రైలర్ రివ్యూ
హరీష్ శంకర్ మార్క్ పంచ్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ స్టైల్ అండ్ స్వాగ్ తో ట్రైలర్ అదిరిపోయింది. ముఖ్యంగా ట్రైలర్ లో పవన్ చెబుతున్న డైలాగ్స్, కొన్ని యాక్షన్ షాట్స్ విశేషంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ఎలివేషన్ కూడా బావుంది. ఫన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయి.
35
వాడు నీకు భయపడలేదా ? ఎవరికీ భపడలేదా ?
ఈ మూవీలో తమిళ నటుడు పార్తీబన్ విలన్ గా నటిస్తున్నారు. ట్రైలర్ విలన్ చెప్పే డైలాగ్ తోనే మొదలవుతుంది. 'వాడు నీకు భయపడలేదా ? ఎవరికీ భపడలేదా ? అని విలన్ అడగడం ఎవరికీ భయపడట్లేదు అని చెప్పే సమాధానం పవన్ పాత్రని ఎలివేట్ చేసే విధంగా ఉంది.
ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారీ మ్యాజిక్ జరుగుద్ది అని శ్రీలీల చెప్పడం.. పవన్ మాయమ్మే మాయమ్మే అంటూ ఫన్నీగా రియాక్ట్ కావడం కూడా ఆకట్టుకుంటోంది. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం డ్యాన్స్ అని పవన్ చెప్పడం.. డ్యాన్స్ తెలుగు పదం కాదు ఇంగ్లీష్ ని కమెడియన్ ప్రవీణ్ చెప్పడం నవ్వులు పూయిస్తోంది. ట్రైలర్ లో ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకునే విధంగా కట్ చేశారు.
55
ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం
ట్రైలర్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ కి కూడా కొదవ లేదు. భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం అంటూ పవన్ చెబుతున్న డైలాగ్ అభిమానుల చేత విజిల్స్ కొట్టించేలా ఉంది. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటూ ట్రైలర్ చివర్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఓవరాల్ గా ఉస్తాద్ ట్రైలర్ లో కమర్షియల్ సినిమాలో ఎలాంటి అంశాలు ఉండాలో అవన్నీ ఉన్నాయి. ట్రైలర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్ ఇచ్చారు. ట్రైలర్ లో తమన్ అందించిన బిజీయం బావుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది.