Pawan Kalyan: నిర్మాత దిల్ రాజు అర్జున అనే టైటిల్‌ను ఫిల్మ్ చాంబర్‌లో రిజిస్టర్ చేశారు. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా కోసం అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అర్జున అనే టైటిల్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ టైటిల్‌ను ఫిల్మ్ చాంబర్‌లో నమోదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ టైటిల్ ఎవరి కోసం, హీరో ఎవరు అనే ప్రశ్నలు తలెత్తాయి. మరి సినీ వర్గాలు ఎం చెబుతున్నాయో ఇప్పుడు చూసేద్దాం..
25
పవన్ కోసమే టైటిల్.?
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, నిర్మాత దిల్ రాజు ఈ అర్జున టైటిల్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్ట్ కోసం రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో దిల్ రాజు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో నటించారు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
35
ఆ ఇద్దరు ఒకరు డైరెక్టర్.?
ఈ సినిమాకు అనిల్ రావిపూడి లేదా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపిస్తోంది. అర్జున టైటిల్ పవన్ కళ్యాణ్ కోసమే అయితే, ఇది మైథలాజికల్ టచ్ ఉన్న సోషల్ కాన్సెప్ట్‌తో రూపొందవచ్చని అంటున్నారు. అయితే, ఈ విషయంలో పూర్తి స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.
ప్రస్తుతానికి, పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సిద్దమవుతోంది. దీని తర్వాత దిల్ రాజుతో పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలకు, ప్రజాసేవకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. వరుసగా జిల్లా పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.
55
పవన్ నెక్స్ట్ సినిమా సంగతేంటి.?
మరోవైపు దిల్ రాజుతో పాటు మరో ఇద్దరు, ముగ్గురు నిర్మాతలకు కూడా పవన్ డేట్స్ ఇచ్చారని, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అప్పుడెప్పుడో ప్రకటించిన సినిమా కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ తన తదుపరి ప్రాజెక్ట్‌లను ఎలా ప్లాన్ చేస్తారో వేచి చూడాలి. అటు అభిమానులు మాత్రం పవన్ సినిమా అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.