డీమాన్‌ పవన్‌ని అలా చూసి తల్లడిల్లిపోయిన రీతూ చౌదరీ.. వీరి రిలేషన్‌పై సంజనా బోల్డ్ కామెంట్

Published : Nov 28, 2025, 07:30 PM IST

బిగ్ బాస్‌ తెలుగు 9 ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అయితే ఇందులో డీమాన్‌ పవన్‌కి గాయం కాగా, రీతూ చౌదరీ అల్లాడిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుడిని వేడుకుంది. 

PREV
15
బిగ్‌ బాస్‌ హౌజ్‌లో వెన్నుపోట్లు

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ 12వ వారం ఎండింగ్‌కి చేరుకుంది. ఓవైపు ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ వారం కెప్టెన్‌ ఎవరనేది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌజ్‌లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. ఈ వారం కెప్టెన్‌ కోసం హౌజ్‌మేట్స్ గట్టిగా పోరాడుతున్నారు. అందులో ఇమ్మాన్యుయెల్‌, సంజనా, దివ్య, రీతూ, కళ్యాణ్‌, డీమాన్‌ పవన్‌ ఉన్నారు. వీరిలో సంజనాకి రీతూ, రీతూకి కావ్య, ఇమ్మాన్యుయెల్‌కి డీమాన్‌ వెన్నుపోటు పొడిచారు. రీతూ విషయంలో దివ్య, సంజనా గట్టిగా కామెంట్లు చేశారు. అదే సమయంలో పవన్‌ తనని పోటీ నుంచి తప్పించడంతో ఇమ్మాన్యుయెల్‌ ఫైర్‌ అయ్యాడు.

25
రీతూ, డీమాన్‌లపై సంజనా కామెంట్‌

మరోవైపు దివ్య, రీతూల మధ్య కూడా గట్టి వాగ్వాదం జరిగింది. ఆ వాదన చాలా పర్సనల్‌గా వెళ్లింది. హౌజ్‌ మొత్తం హీటెక్కించింది. మరోవైపు సంజనాని రీతూ తప్పించడంతో సంజనా బరస్ట్ అయ్యింది. నీ ఆట కనిపించడం లేదని రీతూ అంటే నువ్వేమి ఆడుతున్నావని రివర్స్ ఎటాక్‌ చేసింది సంజనా, పొద్దున లేస్తే నువ్వు ఆ మూలకి, ఆయన(డీమాన్‌ పవన్‌) ఈ మూలకు వెళ్తాడు. ఆ తర్వాత ఆయన వద్దకు వచ్చి ప్యాచప్‌ చేసుకుంటావ్‌. అంతకు మించి నువ్వేమి చేస్తున్నావంటూ హాట్‌ కామెంట్‌ చేసింది సంజనా. ఇది రీతూకి మండింది.   తాము రియల్‌గానే ఉంటున్నామని కౌంటర్‌ ఇచ్చింది రీతూ.

35
కెప్టెన్సీ టాస్క్ లో వెన్నునొప్పితో పడిపోయిన డీమాన్‌ పవన్‌

ఈ టాస్క్ లో మిగిలిన కంటెస్టెంట్లు అందరు కెప్టెన్సీ పోటీ నుంచి తప్పుకోవడంతో చివరికి డీమాన్‌ పవన్‌, కళ్యాణ్‌ మాత్రమే మిగిలారు. వీరికి రోడ్డు వేసే టాస్క్ ఇచ్చారు. ఇందులో కంకర, ఇసుకతో గుంతల రోడ్డుని నీట్‌గా పూడ్చాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో కళ్యాణ్‌తో పోటీలో వెనకబడిపోయాడు పవన్‌. ఇసుక, కంకర మోయడంతో బాగా అలసిపోయాడు పవన్‌. అతనికి బాగా వెన్నునొప్పి వచ్చింది. దీంతో తన టాస్క్ కంప్లీట్‌ చేయలేక ఇబ్బంది పడ్డాడు. వెన్నునొప్పితో తల్లడిల్లిపోయాడు.

45
పవన్‌ని ఆ స్థితిలో చూసి అల్లాడిపోయిన రీతూ

ఇది చూసి రీతూ చౌదరీ తట్టుకోలేకపోయింది. అల్లాడిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుడికి దెండం పెట్టుకుంది. దీంతో అందరు వచ్చి పవన్‌ కోలుకునేలా  చేసే ప్రయత్నం చేశారు. లేటెస్ట్ గా విడుదలైన ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. ఓ వైపు సంజనా పదే పదే పవన్‌, రీతూల రిలేషన్‌పై కామెంట్స్ చేస్తూనే ఉంది. మరోవైపు పవన్‌ కోసం రీతూ ప్రాణాలు ఇచ్చేంత ప్రయత్నం చేస్తూనే ఉంది. ఓ వైపు సంజనాతో విమర్శలు ఎదుర్కొంటూనే, మరోవైపు పవన్‌ కోసం అల్లాడిపోతూ రీతూ హైలైట్ గా మారుతుంది. క్రమంగా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్ గా నిలుస్తుంది.

55
వీరిలో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు?

ఇక ప్రస్తుతం హౌజ్‌లో తనూజ, కళ్యాణ్‌, డీమాన్‌ పవన్‌, ఇమ్మాన్యుయెల్‌, రీతూ చౌదరీ, సంజనా, భరణి, సుమన్‌ శెట్టి, దివ్య ఉన్నారు. వీరిలో ఈ వారం రీతూ చౌదరీ తప్ప మిగిలిన వారంతా నామినేషన్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దివ్య ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories