Pawan Kalyan Uday Kiran Missed Multistarrer టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దివంగత హీరో ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా మిస్ అయ్యిందని మీకు తెటుసా? ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎలా మిస్ అయ్యింది.
హీరోగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేసిన హీరో ఉదయ్ కిరణ్. హీరోగా మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తిగా ఉదయ్ కిరణ కు పరిశ్రమలో పేరుంది. హీరోగా మంచి భవిష్యత్తు ఉండగానే.. మానసిక ఒత్తడి కారణంగా ఉదయ్ కిరణ ఆత్మహత్య చేసుకోవడం అభిమానులను, ప్రేక్షకులను కంటతడిపెట్టించింది. తన సినిమాలతో ప్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ మరణం పై పలు అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో చాలా వెర్షన్లు వినిపిస్తుంటాయి. ఏది ఏమైనా ఫిల్మ్ ఇండస్ట్రీ మంచి హీరోను కోల్పోయింది. అభిమానులు మంచి మనసున్ననటుడిని కోల్పోయారు.
24
ఉదయ్ కిరణ్ సూపర్ హిట్ సినిమాలు
ఉదయ్ కిరణ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. యూత్ కు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే సినిమాలు చేశారు. చిత్ర సినిమాతో స్టార్ట్ అయ్యి నువ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్, కలుసుకోవాలని, లాంటి అద్భుతమైన లవ్ స్టోరీస్ అందించాడు. ఆతరువాత కాలంలో వరుసగా ఫెయిల్యూన్స్ ఫేస్ చేయడంతో కెరీర్ లో ఇబ్బందులు పడ్డాడు ఉదయ్ కిరణ్. అయితే ఆయన కెరీర్ లో ఓ మల్టీ స్టారర్ సినిమా చేయాల్సి ఉందట. అది ఎవరితోనో కాదు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తో. ఉదయ్ కిరణ్ చేయాల్సిన ఆ సి నిమా ఎలా మిస్ అయ్యింది.
34
పవన్ కళ్యాణ్ కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘బంగారం’ సినిమాలో యంగ్ హీరో రాజా పోషించిన కీలక పాత్రను మొదట ఉదయ్ కిరణ్ కోసం ప్లాన్ చేసినట్లు టాలీవుడ్ టాక్. బంగారం సినిమాలో ఆ పాత్రను ఉదయ్ కిరణ్ చేయాలని భావించారట. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ కాంబినేషన్ ఫిక్స్ అయ్యింది అనుకున్న టైమ్ లో ప్రొడ్యూసర్లు కొన్ని కారణాల వల్ల ఉదయ్ కిరణ్‌ను తీసుకోలేకపోయారని తెలుస్తోంది. అసలు కారణం ఏంటి అనేది మాత్రం ఇంత వరకూ తెలియదు.
ఇక ఉదయ్ కిరణ్ చేయాల్సిన పాత్రను రాజా పోషించి.. బంగారం సినిమాతో మంచి గుర్తింపు సాధించాడు. ఇక ఉదయ్ కిరణ్ అప్పటికే వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. కెరీర్ లో చాలా ఇబ్బందికర టైమ్ ను ఫేస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ పాత్ర చేయడానికి అవకాశం దక్కి ఉంటే తన కెరీర్ మళ్లీ మంచి ఫామ్‌లోకి వచ్చుండేది. ఉదయ్ కిరణ్ ఆ తరువాత సోలో హీరోగా అనేక సినిమాలు చేసినప్పటికీ, తనకు ఆశించిన స్థాయి విజయాలు మాత్రం అందలేదు. వ్యక్తిగతంగా, వృత్తిపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్న ఆయన చివరకు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు గతంలో వెల్లడించారు.