NTR and Vijay: ఆగిపోయిన ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు.. బెడిసికొడుతున్న రాజమౌళి స్ట్రాటజీ

Published : Dec 06, 2025, 04:25 PM IST

సినిమాల్లో రెండు పార్ట్ లు అనే స్ట్రాటజీ బెడిసి కొడుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు ఆగిపోతున్నాయి. వాటిని పక్కన పెట్టే పనిలో మేకర్స్ ఉన్నారట. 

PREV
15
రెండు పార్ట్ ల ట్రెండ్‌ స్టార్ట్ చేసిన రాజమౌళి

రాజమౌళి రెండు పార్ట్ లు అనే స్ట్రాటజీని తీసుకొచ్చారు. ఒకే సినిమాలో కథ మొత్తం చెప్పలేని స్థితిలో రెండు పార్ట్ లు చేశారు. `బాహుబలి` విషయంలో ఇది జరిగింది. కానీ సక్సెస్‌ అయ్యింది. `బాహుబలి` పార్ట్ వన్‌ కంటే `బాహుబలి 2` ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అదే స్ట్రాటజీ `కేజీఎఫ్‌`, `పుష్ప`కి పనిచేసింది. `పుష్ప 2` మూవీ సైతం సంచలనం సృష్టించింది. ఆల్మోస్ట్ `బాహుబమలి 2`ని టచ్‌ చేసింది. అలాగే `కేజీఎఫ్‌ 2` కూడా బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. దీంతో వరుసగా ఇదే స్ట్రాటజీతో సినిమాలు వస్తున్నాయి.

25
ఆగిపోబోతున్న ఎన్టీఆర్‌, విజయ్ సినిమాలు

కథలో దమ్ములేకపోయిన ఇప్పుడు రెండు పార్ట్ లుగా తెరకెక్కిస్తున్నారు దర్శక, నిర్మాతలు. బడ్జెట్‌ రికవరీ కోసం, కాసుల కక్కుర్తి కోసం రెండు పార్ట్ ల వెంట ప్రాకులాడుతూ కథలను రెండు పార్ట్ లుగా సాగదీస్తున్నారు. కానీ అది క్రమంగా బెడిసికొడుతుంది. రాజమౌళి స్ట్రాటజీ ఇప్పుడు తేడా కొడుతుంది. అందుకు ఫలితమే ఇప్పుడు రెండు సినిమాలు ఆగిపోతుండటం. రాజమౌళి స్ట్రాటజీనే ఫాలో అవుతూ వచ్చిన ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు ఇప్పుడు ఆగిపోయే పరిస్థితికి చేరుకున్నాయి.

35
`దేవర 2`పై అనుమానాలు

ఎన్టీఆర్‌.. కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` చిత్రంలో నటించారు. జాన్వీ కపూర్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రమిది. గతేడాది ఆడియెన్స్ ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందింది. కానీ తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. యాక్షన్‌ మూవీ కావడంతో నార్త్ లో బాగానే ఆడింది. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లని రాబట్టింది. కానీ తెలుగు స్టేట్స్ లో మాత్రం ఫెయిల్‌ అయ్యింది. దీన్ని రెండు పార్ట్ లుగా తీసుకొస్తామని టీమ్‌ అప్పుడే ప్రకటించింది. `దేవర 2`కి ప్లాన్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాని పక్కన పెట్టారట. మొదటి పార్టే నష్టాలను తీసుకురావడంతో ఇన్నాళ్లు దీన్ని తీయాలా? వద్దా అనే డైలామాలో పడ్డారు. ఆ మధ్య ఉంటుందనే ప్రకటన వచ్చింది. ఏడాది సందర్భంగా అప్‌ డేట్‌ని ప్రకటించింది.  కానీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టాలనే ఆలోచనకు వచ్చారట. ఎన్టీఆర్‌ ఈ మూవీపై ఏమాత్రం ఆసక్తిగా లేరని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ వేరే హీరోతో కొత్త సబ్జెక్ట్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

45
`కింగ్డమ్‌ 2`ని పక్కన పెట్టారట

ఇక ఇదే దారిలో విజయ్‌ దేవరకొండ మూవీ కూడా ఉంది. ఆయన ఇటీవల `కింగ్డమ్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ క్రిటికల్‌ పరంగా ఫర్వాలేదనిపించింది. కానీ కమర్షియల్‌గా ఆడలేదు. పెట్టిన డబ్బులు కూడా రాలేదు. బయ్యర్లకి బాగానే నష్టాలను తీసుకొచ్చింది. అయితే ఇన్నాళ్లు `కింగ్డమ్‌ 2`ని తీయాలనే హోప్‌తో దర్శక, నిర్మాతలు, హీరో కూడా ఉన్నారు. కానీ అనేక పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పక్కన పెట్టారని సమాచారం. ఈ సినిమాని వదిలేసుకునే ఆలోచనకు నిర్మాత నాగవంశీ వచ్చినట్టు టాక్‌. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

55
`సలార్‌ 2`, `కల్కి 2` పరిస్థితేంటి?

వీటితోపాటు పార్ట్ 2లు రావాల్సిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ప్రభాస్‌ నటిస్తున్న రెండు సినిమాలున్నాయి. `సలార్‌ 2` రావాల్సి ఉంది. దీంతోపాటు `కల్కి 2` కూడా తెరకెక్కించాల్సి ఉంది. వీటిపై మాత్రం మేకర్స్ సీరియస్‌గానే ఉన్నారు. `కల్కి 2` విషయంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సీరియస్‌గానే వర్క్ చేస్తున్నారు. అలాగే `సలార్‌ 2` కథని తెరకెక్కించే పనిలోనూ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఉన్నట్టు సమాచారం. కాకపోతే దీనికి చాలా టైమ్‌ పడుతుందని సమాచారం. అప్పటి పరిణామాలను బట్టి ఈ మూవీ ఉంటుందని చెప్పొచ్చు. ఇవే కాదు, ప్రస్తుతం హను రాఘవపూడి కాంబినేషన్‌లోనూ రూపొందుతున్న `ఫౌజీ` చిత్రాన్ని కూడా రెండు పార్ట్ లుగా తీయబోతున్నట్టు సమాచారం. మరి ఈ రెండు పార్ట్ లు ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. కానీ క్రమంలో ఈ స్ట్రాటజీకి కాలం చెల్లిందనే ఫీలింగ్ కలుగుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories