డాక్టర్, సైకాలజిస్ట్, మోడల్ ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న పవన్ హీరోయిన్ ఎవరో తెలుసా ? ఒక్క సినిమాతోనే మాయం

Published : Sep 07, 2025, 12:41 PM IST

పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన ఓ హీరోయిన్ డాక్టర్ గా, సైకాలజిస్ట్ గా, మోడల్ గా రాణించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న ఆ హీరోయిన్ ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15

చిత్ర పరిశ్రమలో మల్టీ ట్యాలెంటెడ్ అయిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వివిధ రంగాలలో రాణించే అమ్మాయిలు కూడా హీరోయిన్లుగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. సాఫ్ట్ వేర్లుగా, డాక్టర్లుగా రాణించే అమ్మాయిలు హీరోయిన్లుగా అవకాశాలు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. శ్రీలీల, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు మెడిసిన్ చదివి హీరోయిన్లుగా అవకాశాలు అందుకున్నారు. 

25

దాదాపు 26 ఏళ్ళ క్రితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో ఓ డాక్టర్ హీరోయిన్ గా నటించింది. పవన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన తమ్ముడు చిత్రం అది. ఈ మూవీలో ప్రీతీ జింగ్యానీతో పాటు మరో హీరోయిన్ కూడా నటించింది. ఆమె పేరు అదితి గోవిత్రికర్. వృత్తిరీత్యా ఆమె డాక్టర్. అదితి గోవిత్రికర్ కేవలం డాక్టర్ మాత్రమే కాదు సైకాలజిస్ట్ కూడా. 

35

డాక్టర్ చదివినప్పటికీ ఆమె మోడలింగ్ పై ఆసక్తితో ఆ రంగాన్ని ఎంచుకున్నారు. మోడలింగ్ లో ఆమె అద్భుతంగా రాణించారు. మిస్సెస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి ఇండియన్ మహిళగా అదితి గోవిత్రికర్ రికార్డ్ సృష్టించారు.మోడలింగ్ లో ఉన్నప్పుడు ఆమె పలు కార్పొరేట్ సంస్థల యాడ్స్ లో నటించారు. పాండ్స్, కోకోకోలా లాంటి సంస్థల యాడ్స్ లో ఆమె నటించడం విశేషం. 

45

అయితే నటిగా రాణించాలనే ఆమె కోరిక పాక్షికంగా మాత్రమే నెరవేరింది. పవన్ కళ్యాణ్ తమ్ముడు చిత్రంతో అదితి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ అదితికి తెలుగులో అవకాశాలు రాలేదు. తెలుగులో ఆమె నటించిన ఏకైక చిత్రం తమ్ముడు మాత్రమే. ఆ తర్వాత బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటించింది. అక్కడ కూడా ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. 

55

ఈ క్రమంలో వ్యక్తిగత జీవితంలో కూడా అదితి కొన్ని సవాళ్లు ఎదుర్కొంది. 2007లో ఆమె తన భర్త ముఫజల్ నుంచి విడాకులు తీసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. భర్త నుంచి విడిపోయాక పిల్లల పోషణ కోసం అదితి తిరిగి డాక్టర్ వృత్తిలో చేరారు. ప్రస్తుతం ఆమె డాక్టర్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 51 ఏళ్ళు. 

Read more Photos on
click me!

Recommended Stories