బిగ్ బాస్ భామకు పవన్ తెలుగు లేఖ.. నువ్వు బాగుండాలంటూ...!

First Published Mar 1, 2021, 10:10 AM IST

బిగ్ బాస్ బ్యూటీ హిమజ సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ తనకు రాసిన లేఖను సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు, అవధులు లేని ఆనందం అనుభవిస్తున్నట్లు తెలియజేసింది. పవన్ స్వయంగా రాసిన ఆ లేఖలో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు ప్రకటించగా వాటి షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇటీవలే వకీల్ సాబ్ షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్, అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ మరియు క్రిష్ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.
undefined
దర్శకుడు క్రిష్ పీరియాడిక్ మూవీగా పవన్ 27వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీలో ఓ పాత్ర చేసే అవకాశం దక్కించుకున్నారు బుల్లితెర నటి హిమజ.  పవన్-క్రిష్ మూవీ సెట్స్ లో జాయిన్ అయిన హిమజ పవన్ తో ఫోటోలు దిగడం జరిగింది.
undefined
పవన్ గారిని కలిస్తే చాలని అనుకునే దానిని, అలాంటిది కలిసి నటించే అవకాశం దక్కిందని హిమజ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేసింది.
undefined
కాగా పవన్ కళ్యాణ్ స్వయంగా హిమజకు ఓ లేఖ రాసి ఇచ్చారు. హిమజ కెరీర్ బాగుండాలని, ఆమె మంచి స్థాయికి వెళ్లాలని కోరుతూ.. తెల్ల పేపర్ పై ఓ సందేశం రాసి... సంతకం చేసి ఇచ్చారు.  పవన్ స్వహస్తాలతో తనకు బెస్ట్ విషెస్ చెబుతూ రాసిన ఆ లేఖను హిమజ అపురూపంగా భావిస్తున్నారు.
undefined
ఇక పవన్ తనకు లేక రాయడంతో తన ఆనందం వ్యక్తం చేయడానికి పదాలు, ఎమోజీలు లేవని.. అంతటి అపరిమితమైన సంతోషం కలిగినట్లు హిమజ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
undefined
మరి ఓ చిన్న స్థాయి నటి పట్ల పవన్ కళ్యాణ్ చూపిన ప్రేమాభిమానాలకు అందరూ ఫిదా అవుతున్నారు. అలాగే హిమజ అదృష్టాన్ని కొనియాడుతున్నారు.
undefined
కాగా పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీ సంక్రాంతి కానుకగా 2022 జనవరిలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు.
undefined
అలాగే  క్రిష్ మూవీలో పవన్ బందిపోటు రోల్ చేస్తుండగా... ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ శివరాత్రి కానుకగా మార్చ్ 11న విడుదల చేయనున్నారు.
undefined
click me!