కోటులో కూడా ఇంత హాట్ గా కనిపించొచ్చా... కసిగా టెంప్ట్ చేస్తున్న కాజల్

హాట్ ఫిగర్ ఉండాలే కానీ అవుట్ ఫిట్ తో సంబంధం లేకుండా గ్లామర్ తో కవ్వించొచ్చని కాజల్ నిరూపిస్తుంది. కోటు, ప్యాంటులో కూడా కాజల్ కళ్ళతో కసిగా వలవేసి లాగేస్తుంటే... ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

లూజ్ హెయిర్.. లైట్ గ్రీన్ కోటు, ప్యాంటు ధరించిన కాజల్ సెక్సీ ఫోటో షూట్ చేశారు. జెంటిల్ లుక్ లో కూడా హీటెక్కించేలా ఆమె ఫోటోలు ఉన్నాయి.
తన గ్లామర్ తో ఏళ్లుగా టాలీవుడ్ ని ఏలుతున్న బ్యూటీ క్వీన్ కాజల్ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్, క్రేజీగా ఫీలవుతున్నారు.

ఇటీవలే పెళ్లి చేసుకున్న కాజల్... యధావిధిగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేయడంతో పాటు, కొత్త ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు.
ఇటీవల విడుదలైన కాజల్ అగర్వాల్ డెబ్యూ వెబ్ సిరీస్ లైవ్ టెలీకాస్ట్ ఓ మోస్తరు ఆదరణ దక్కించుకుంది. ఈ సిరీస్ లో అల్ట్రా మోడ్రెన్ గర్ల్ గా కాజల్ మందు, సిగరెట్ తాగుతూ కొత్తగా కనిపించారు ఆమె.
మరోవైపు కాజల్ నటించిన, నటించాల్సిన చిత్రాలు అరడజను వరకు ఉన్నాయి. వాటిలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య కూడా ఒకటి. ఈ మూవీ మేలో విడుదల కానుంది.
అలాగే భారీ చిత్రాల దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు 2 మూవీ విడుదల కావాల్సి ఉంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన మోసగాళ్లు మూవీలో కాజల్ నటిస్తున్న విషయం తెలిసిందే.
అలాగే తన భర్త సొంత ఫర్నిచర్ సంస్థ కిచ్లింగ్ ఉత్పత్తులకు ప్రచార కర్తగా కూడా కాజల్ వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థ వ్యాపార ప్రకటనలలో ఆమె కనిపిస్తున్నారు.
మొత్తంగా పెళ్లి అయిన తరువాత కూడా తన జోరు తగ్గించకుండా దూసుకుపోతుంది కాజల్ అగర్వాల్.

Kajal Agarwal

Latest Videos

click me!