డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా `గేమ్ ఛేంజర్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టికెట్ రేట్లు ఎందుకు పెంచుతామో తెలిపారు. డిమాండ్ అండ్ సప్లై బేస్ మీద టికెట్ రేట్లు పెంచుతామని, పెద్ద సినిమాలకు, భారీ బడ్జెట్ చిత్రాలకు డబ్బులు రావాలంటే టికెట్ రేట్లు పెంచాలనే విషయాన్ని తెలిపారు. అయితే పెంచిన డబ్బుల్లో 18 శాతం ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో వస్తుందన్నారు పవన్.
మరోవైపు ఏపీలో సినిమాని అభివృద్ధి చేయాలని, అక్కడ కూడా ఇనిస్టిట్యూట్లు పెట్టాలని, దర్శకత్వం, ఆర్ట్, కొరియోగ్రఫీ, మ్యూజిక్ ఇలా వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వం అన్ని రకాలుగాసపోర్ట్ గా ఉంటుందన్నారు. ఇంకోవైపు సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పారు పవన్.
`వకీల్ సాబ్`లో అమ్మాయిని వర్జీనా అనే డైలాగ్ చెప్పడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని, చెప్పలేను అని చెప్పినట్టు తెలిపారు.కాబట్టి సినిమాల ద్వారా మంచి విషయాలు చెప్పాలని, శంకర్ గారు తీసిన `ఒకే ఒక్కడు`, శివాజీ వంటివి చూస్తుంటే ఓ తృప్తి కలుగుతుంది. సినిమాలో మంచి చెడులూ ఉంటాయి.
ఏది తీసుకోవాలనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. వినోదంతో పాటు ఆలోచింపజేసే చిత్రాలు కూడా రావాలని కోరుకుంటున్నాను. విలువల్ని నేర్పించే చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఓ విషయాన్ని బలంగా చెప్పారు. చిరంజీవి గురించి గొప్పగా చెప్పారు. బేసిక్‌గా పవన్ అన్నయ్య గురించి తరచూ చెబుతుంటారు, కానీ ఏ విషయం చెప్పాలో అంతే చెబుతారు. కానీ ఈ ఈవెంట్‌లో మాత్రం చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పారు.
తాను డిప్యూటీ సీఎం అయినా, మన్యంలో కాలినడకన వెళ్లగలిగినా,ఈ స్థాయికి ఎదిగినా, చరణ్ గ్లోబల్ స్టార్ అయినా దానికి మూలం చిరంజీవి అని, ఆయన కష్టం వల్లే తాము ఎదిగామని, మూలాలు ఎప్పుడూ మర్చిపోకూడదని తెలిపారు పవన్.
రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయినా, ఆస్కార్ వేదిక వరకు వెళ్లినా, విజయం గర్వం ఉండదని, డౌన్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తాడని, తమ ఫ్యామిలీ అహంకారం ఉండదని తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే లక్షణం చిరంజీవి నుంచి నేర్చుకున్నాడని రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు.
అయితే మనం ఏ స్థాయి నుంచి వచ్చామో అనేది మూలాలు మర్చిపోకూడదని బలంగా చెప్పే ప్రయత్నం చేశారు పవన్. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారింది. పవన్ ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే పవన్ వ్యాఖ్యలను అల్లు అర్జున్ సంఘటనతో ముడిపెడుతున్నారు నెటిజన్లు.
`పుష్ప 2` సినిమా విషయంలో అల్లు అర్జున్ అతి చేశారనే విమర్శలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన పరోక్షంగా ఆ హీరోకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు నెటిజన్లు. అందుకే ఆయా విషయాలను బలంగా చెప్పాడని అంటున్నారు. మొత్తానికి బన్నీని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది.
మరోవైపు ఇండస్ట్రీ గురించి, ఇతర హీరోల గురించి మాట్లాడారు పవన్. ఏపీలో వైసీపీ ప్రభుత్వంలా తాము వ్యవహరించమని, సినిమానికి రాజకీయ రంగు పులుమడం తనకు నచ్చదని, హీరోలతో నమస్కారాలు పెట్టించుకోవడం నచ్చదని తెలిపారు.
అది చిన్న మనస్కులు చేస్తారని, తాము ఎప్పుడూ ఆలోచించమని తెలిపారు. తమ కూటమికి చాలా మంది హీరోలు సపోర్ట్ చేయలేదు. కానీ టికెట్ రేట్ల విషయంలో తాము ఆ వివక్ష చూపించడం లేదని, అందరిని సమానంగానే చూస్తున్నామన్నారు.
స్వర్గీయ ఎన్టీరామారావు ఎప్పుడూ కూడా ఎవ్వరి మీద వివక్షను చూపించలేదు. చంద్రబాబు గారు సైతం ఎప్పుడూ తెలుగు చిత్ర సీమ అభివృద్దికి దోహద పడుతూనే ఉన్నారని తెలిపారు. తమకు సపోర్ట్ చేయకపోయినా టికెట్ రేట్లు పెంచే విషయంలో సపోర్ట్ చేస్తున్నామని, సినిమాని, రాజకీయాలను సెపరేట్‌గానే చూస్తానని తెలిపారు పవన్.
read more: మూలాలు మర్చిపోకూడదు, రామ్ చరణ్ చిరంజీవి వారసుడు.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్
also read: 'గేమ్ ఛేంజర్' కథ శంకర్ గారు ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాశారో తెలుసా.. రాంచరణ్ క్రేజీ కామెంట్స్