రాంచరణ్ కి పేరు పెట్టింది ఎవరో తెలుసా ? దాని వెనుక ఇంత అర్థం ఉందా..తొలిసారి బయటపెట్టిన పవన్

First Published | Jan 4, 2025, 11:09 PM IST

గేమ్ ఛేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా రాజమండ్రిలో జరిగింది. ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ బాబాయ్, అబ్బాయి ఇద్దరూ వేదికపై కనిపించడమే అని చెప్పొచ్చు. చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ పక్క పక్కన నిలబడి కనిపిస్తూ ఉంటే ఫ్యాన్స్ కనుల పండుగలా మారింది.

గేమ్ ఛేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా రాజమండ్రిలో జరిగింది. ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ బాబాయ్, అబ్బాయి ఇద్దరూ వేదికపై కనిపించడమే అని చెప్పొచ్చు. చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ పక్క పక్కన నిలబడి కనిపిస్తూ ఉంటే ఫ్యాన్స్ కనుల పండుగలా మారింది. ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ మరో హైలైట్. ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ చిత్ర పరిశ్రమకి దిశా నిర్దేశం చేస్తూ.. దాదాసాహెబ్, సత్యజిత్ రే, ఎన్టీఆర్, కృష్ణ, రాజ్ కపూర్ లాంటి వారిని స్మరించుకుంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం కొనసాగింది. 

తన కుటుంబం గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. రాంచరణ్ అయినా, తాను అయినా ఈ స్థాయికి వచ్చాము అంటే అందుకు కారణం చిరంజీవి గారు అని పవన్ తెలిపారు. రాంచరణ్ ఈ స్థాయికి చేరుకున్నందుకు తనకి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాంచరణ్ పుట్టినప్పుడు నామకరణం జరిగింది. రాంచరణ్ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ని పవన్ తొలిసారి రివీల్ చేశారు. 


మా కుటుంబం మొత్తం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాం. మా నాన్న రాంచరణ్ కి ఆంజనేయ స్వామి పేరు వచ్చేలా నామకరణం చేశారు. శ్రీరాముడి చరణాల వద్ద ఉండేవాడు ఆంజనేయుడు.. కాబట్టి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. ఎంత శక్తి వంతుడు అయినప్పటికీ హనుమంతుడు రాముడి పాదాల వద్ద ఒదిగి ఉంటాడు. రాంచరణ్ కూడా అలాగే ఒదిగి ఉండాలని ఆ పేరు పెట్టారు. రాంచరణ్ కి తన శక్తి తనకి తెలియదు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ వినయవిధేయతలతో ఉంటాడు అని పవన్ అన్నారు. 

Also Read : రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో జబర్దస్త్ రీతూ చౌదరి, ఆమె భర్త ఎవరో తెలుసా..మామూలోడు కాదు ఇరికించేశాడు

రాంచరణ్ సంవత్సరంలో 100 రోజులు అయ్యప్ప మాల, అంజనేయ స్వామి మాల, వివిధ దీక్షల్లో ఉంటాడు. కనీసం చెప్పులు కూడా వేసుకోడు. ఎందుకురా ఇన్ని దీక్షలు అని అడిగా (చరణ్ ని నేను రా అనొచ్చు కదా అంటూ పవన్ నవ్వుతూ.. ) దీనికి చరణ్ ఏం చెప్పాడంటే.. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి, గర్వం దరిచేరకుండా ఉండడానికి అని చెప్పాడట. 

Also Read : ముదిరిన రచ్చ, డాకు మహారాజ్ చిత్రాన్ని బాయ్ కాట్ చేస్తామంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..మధ్యలో నలిగిపోయేది వాళ్ళే

Latest Videos

click me!