పవన్‌ కళ్యాణ్‌, సౌందర్య చేయాల్సిన సినిమా ఏంటో తెలుసా? ఎలా మిస్‌ అయ్యింది? పవన్‌ భయపడ్డాడా?

First Published | Nov 2, 2024, 7:15 PM IST

పవన్‌ కళ్యాణ్‌, సౌందర్య కాంబినేషన్‌లో సినిమా రావాల్సింది. అంతా ఓకే అనుకున్నారు. అనూహ్యంగా పవర్‌ స్టార్‌ ట్విస్ట్ ఇచ్చాడు. మరి ఆ మూవీ ఏంటి? పవన్‌ ఏం చేశాడు?
 

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ ఇప్పుడున్న చాలా మంది హీరోయిన్లతో సినిమాలు చేశారు. కాజల్, సమంత, శృతి హాసన్‌, తమన్నా, కీర్తిసురేష్‌, కీర్తి రెడ్డి, ఇలియానా, శ్రియా, మీరా జాస్మిన్‌ ఇలా చాలా మంది కథానాయికలతో ఆడిపాడాడు. సీనియర్లలో దేవయాని, రాశీ, రేణు దేశాయ్‌, అమిషా పటేల్‌ వంటి హీరోయిన్లు కూడా ఉన్నారు. వీరిలో చాలా మంది ఫేడౌట్‌ అయ్యారు. వీరు కాకుండా మరికొంత మంది హీరోయిన్లు అడ్రెస్‌ లేకుండా పోయారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

కానీ ఓ అదిరిపోయే కాంబినేషన్‌ సెట్‌ కావాల్సింది. పవన్‌ సౌందర్యతో సినిమా చేయాల్సింది. కానీ అది సెట్ కాలేదు. సౌందర్య, పవన్‌ కాంబినేషన్‌లో సినిమా ఓకే అనుకున్నారు. కానీ పవనే నో చెప్పాడట. మరి ఆ సినిమా ఏంటనేది చూస్తే, అది `సుస్వాగతం`. ఈ మూవీకి భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు. ఇందులో దేవయాని హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్‌. పవన్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లు అందుకోవడానికి బీజం వేసిన సినిమా ఇదే. ఆ తర్వాత వరుసగా ఆయన విజయాలు అందుకున్నారు. తిరుగులేని స్టార్‌ డమ్‌తోపాటు పవర్‌ స్టార్‌ అనేట్యాగ్‌ని 
సొంతం చేసుకున్నారు.  
 


అయితే `సుస్వాగతం` సినిమాకి మొదట అనుకున్న హీరోయిన్‌ సౌందర్యనే అట. పవన్‌కి జోడీగా సౌందర్య అయితే బాగా సెట్‌ అవుతుందని, సినిమా అదిరిపోతుందని, సౌందర్య యాక్టింగ్‌ కి పవన్‌ స్టయిల్‌, ఆయన మార్క్ ఇన్నోసెన్సీ యాడ్‌ అయితే సినిమా వేరే లెవల్‌లో ఉంటుందని భావించారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ రిజెక్ట్ చేశాడట. సౌందర్య అద్భుతమైన నటి. పవన్‌ అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు. ఆమె ముందు నటిస్తే తాను తగ్గిపోతానని, ఆమెతో పోటీ పడి చేయలేనని చెప్పి సౌందర్యని వద్దు అన్నారట. సౌందర్యతో సమానంగా తాను చేయలేనని స్పష్టం చేశారట. ఎంత చెప్పినా వినలేదు. దీంతో చేసేదేం లేక ఆమెని తప్పించి దేవయానిని తీసుకొచ్చారు. దేవయాని తెలుగు ఆడియెన్స్ కి తెలుసు. కానీ అంతగా ఇమేజ్‌ లేదు. దీంతో పవన్‌ డామినేషన్‌ పనిచేసింది. సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. 
 

అయితే సౌందర్య చేస్తే మాత్రం సినిమా ఫలితం మరో స్థాయిలో ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఒక అద్భుతమైన కాంబినేషన్‌ మిస్‌ అయ్యింది. ఈ అరుదైన కాంబోలో సినిమా పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్ ఎప్పుడూ చూసుకున్నా మంచి ఫీస్ట్ లా ఉండేదని, స్పెషల్‌గా నిలిచేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. `సుస్వాగతం` సినిమాతో హిట్ల పరంపర స్టార్ట్ చేసిన పవన్‌ `తొలిప్రేమ`, `తమ్ముడు`, `బద్రి`, `ఖుషి` చిత్రాలతో ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. వరుసగా ఐదు హిట్‌ సినిమాలు, అవి కూడా బ్లాక్‌ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ గా నిలవడం విశేషం. దీంతో అప్పట్లో పవన్‌ క్రేజ్‌ పీక్‌లోకి వెళ్లిపోయింది. ఇంతటి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారంటే అందుకు ఈ సినిమాలే కారణమని చెప్పొచ్చు. 
 

ఇక రాజకీయాల్లోకి వెళ్లిన పవన్‌ ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. మరోవైపు ఆయన చేయాల్సిన మూడు సినిమాలు కూడా ఉన్నాయి. `ఓజీ`, `హరిహర వీరమల్లు`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రాలు చేయాల్సి ఉంది. టైమ్‌ కుదుర్చుకుని ప్రస్తుతం `ఓజీ`, `హరిహర వీరమల్లు` సినిమాలు కంప్లీట్‌ చేసే పనిలో ఉన్నారు. ఈ రెండు పూర్తయ్యాక `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఉంటుంది. అయితే షూటింగ్‌కి సంబంధించి చాలా వరకు పవన్‌ కళ్యాణ్‌ సన్నివేశాలను డూప్‌తోనే లాగిస్తున్నారని సమాచారం. 

Read more: ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా నలుగురు హీరోల చేతుల్లో మోసపోయిన నగ్మా.. సంచలన నిర్ణయం వెనుక గుండె పగిలేనిజాలు

also read: పెళ్లికి ముందే ఐశ్వర్యా రాయ్‌ కొడుకుని కన్నదా?, విడాకుల వార్తల నేపథ్యంలో షాకింగ్‌ విషయం బయటకు

Latest Videos

click me!