Akira Nandan : అకీరా నందన్ స్పెషల్ పెర్పామెన్స్.. ‘యానిమల్’ స్టోరీకి కనెక్ట్ అయ్యిందే? తండ్రి పవన్ కోసమేనా!?

Published : Jan 16, 2024, 10:41 AM IST

సంక్రాంతి సెలబ్రేషన్స్ లో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ Akira Nandan పియానో వాయించడం నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది. తండ్రి కోసమే అంటూ ఆ వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

PREV
16
Akira Nandan : అకీరా నందన్ స్పెషల్ పెర్పామెన్స్.. ‘యానిమల్’ స్టోరీకి కనెక్ట్ అయ్యిందే? తండ్రి పవన్ కోసమేనా!?

మెగా ఫ్యామిలీ ఇంట సంక్రాంతి సెలబ్రేషన్స్ Sankranthi 2024 గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. అటు అల్లు వారి ఫ్యామిలీ, ఇటు మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరి పండుగను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. 
 

26

కానీ ఈ పండుగకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan మాత్రం హాజరు కాలేదు. కొడుకు అకిరా నందన్, కూతురు ఆద్య Aadhya మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా అకీరా నందన్ స్పెషల్ పెర్ఫామెన్స్ ఇచ్చారు.

36

కుటుంబ సభ్యులను అలరించేందుకు పియానో వాయించాడు. అందుకు సంబంధించిన వీడియోను రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల Upasana Konidela  వీడియోను ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. అకీరా కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. 

46

అయితే, ఆ వీడియోను పోస్ట్ చేస్తూ అకీరా వాయించిన మెలోడీ టోన్ కాకుండా... ‘యానిమల్’ Animal Movieలో ‘నాన్నసాంగ్’ బీజీఎంను యాడ్ చేసి వీడియోను పోస్ట్ చేశారు. దీంతో అకీరా వాయిస్తుండటం.. ఆ వెంటనే బీజీఎం రావడంతో ‘యానిమల్’ మూవీ స్టోరీకి సింక్ అయ్యిందంటున్నారు. 

56

అకిరా నందన్ తన తండ్రి వవన్ కళ్యాణ్ కోసమే ఈ ట్యూన్ వాయించినట్టు ఉందని... అకిరా రియల్ లైఫ్.. ‘యానిమల్’ మూవీ స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యిందంటున్నారు. ఈ సందర్భంగా పలువురు పవన్ ను అకిరా ప్రశ్నిస్తున్నారని కూడా అభిప్రాయపడుతున్నారు. 

66

‘మేమంతా పెద్దనాన్న ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ లో ఉంటే.. మీరు పండగపూట కూడా జనం జనం అంటూ బిజీగా ఉన్నారు నాన్న’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు అకిరా నందన్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం అకిరా అమెరికాలోని ఓ ఇన్స్టిట్యూట్ లో సంగీత పాటలు నేర్చుకుంటున్నట్టు తెలుస్తోంది.  

Read more Photos on
click me!

Recommended Stories