కార్లు, బంగ్లాలు... గెటప్ శ్రీను ఆస్తుల విలువ ఎన్ని కోట్లు? స్వయంగా వెల్లడించిన మాజీ జబర్దస్త్ కమెడియన్ 

Published : Jan 16, 2024, 08:38 AM ISTUpdated : Jan 16, 2024, 08:49 AM IST

గెటప్ శ్రీను జబర్దస్త్ కమెడియన్ గా ఏళ్ల తరబడి నవ్వించారు. ఆ షో వేదికగా పాపులర్ అయ్యాడు. గెటప్ శ్రీను తాను సంపాదించిన ఆస్తుల గురించి తాజా ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు.   

PREV
17
కార్లు, బంగ్లాలు... గెటప్ శ్రీను ఆస్తుల విలువ ఎన్ని కోట్లు? స్వయంగా వెల్లడించిన మాజీ జబర్దస్త్ కమెడియన్ 
Getup Sreenu

ఒక్క షో చాలా మంది జీవితాలు మార్చేసింది. నాగబాబు, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను... ఇంకా చాలా మంది జబర్దస్త్ కారణంగా సెటిల్ అయ్యారు. కనీసం తినడానికి తిండి కూడా లేని స్థాయి నుండి హైదరాబాద్ లో ఇళ్ళు, కార్లు సంపాదించే స్థాయికి ఎదిగారు. 


 

27
Getup Sreenu

గెటప్ శ్రీను జబర్దస్త్ స్టార్ కమెడియన్స్ లో ఒకడు. మనోడి యాక్టింగ్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. వందల గెటప్స్ వేసి జనాలను ఏళ్ల తరబడి నవ్వించాడు. గెటప్ శ్రీను చేసిన కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. 

37
Getup Sreenu

గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్ లది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ ముగ్గురు కలిశారంటే స్కిట్ పండాల్సిందే. నవ్వులు పూయాల్సిందే. గెటప్ శ్రీను జబర్దస్త్ మానేసి చాలా కాలం అవుతుంది. అతడు నటుడిగా బిజీ అయ్యాడు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హనుమాన్ మూవీలో కీలక రోల్ చేశాడు. 
 

47
Getup Sreenu


రాజు యాదవ్ టైటిల్ తో హీరోగా కూడా మూవీ చేస్తున్నాడు. ఇది త్వరలో విడుదల కానుంది. సిల్వర్ స్క్రీన్ మీద కూడా స్టార్ కమెడియన్ గా ఎదుగుతున్న గెటప్ శ్రీను తన ఆస్తుల పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాజా ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. 
 

57
Getup Sreenu

జబర్దస్త్ వలన సెటిల్ అయిన మాట వాస్తవమే. అలా అని కోట్లు ఏమీ లేవు. ఇల్లు ఉంది దాని ఈఎంఐ కట్టాలి. అలాగే కారు మీద కూడా ఈఎంఐ ఉంది.  అలాగే నేను పెద్ద పెద్ద బంగ్లాను, బీఎండబ్ల్యు కార్లు కోరుకోను. ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి అనుకుంటాను. 
 

67
Getup Sreenu

పెద్ద పెద్ద కమిట్మెంట్స్ పెట్టుకుంటే నిద్ర పట్టదు. అంతకంటే దరిద్రం ఉండదు. ఉదయాన్నే ప్రశాంతంగా లేచేలా జీవితం ఉండాలి. డబ్బు ఒత్తిడి ఉన్నప్పుడు ఈ సినిమా పడితే అది చేయాల్సి వస్తుంది. అప్పుడు క్రియేటివిటీ దెబ్బతింటుంది. ఒత్తిడి లేకపోతే సెలెక్టివ్ గా సినిమాలు చేస్తాను. వర్క్ సైడ్ డిస్ట్రబ్ కాదు, అని చెప్పుకొచ్చాడు. 

 

77
Getup Sreenu

ఇక జబర్దస్త్ మానేసినా చూస్తాను అని గెటప్ శ్రీను అన్నాడు. ఇక రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్ లను తరచూ కలుస్తూనే ఉంటాను. వాళ్ళను మిస్ అయ్యేది లేదని చెప్పుకొచ్చాడు. 
 

click me!

Recommended Stories