GuppedanthaManasu 16th January Episode: సీన్ లో కి మినిస్టర్ ఎంట్రీ, శైలేంద్ర ప్లాన్ సక్సెస్, షాక్ లో వసు

First Published Jan 16, 2024, 8:16 AM IST

రిషి సర్ చనిపోయాడని, మాకు తెలుసు అంటూ ఆ స్టూడెంట్ అంటాడు. అది విని మహేంద్ర షాకౌతాడు.
 

Guppedantha Manasu


GuppedanthaManasu 16th January Episode: కాలేజీలో శైలేంద్ర కలకలం సృష్టిస్తాడు. రిషి చనిపోయాడని, అందుకే వసుధార కూడా రావడం లేదు అని నమ్మిస్తాడు. అది విని కాలేజీలో లెక్చరర్స్, స్టూడెంట్స్ ధర్నా చేయడం మొదలుపెడతారు. తమకు రిషి సర్ కావాలంటూ నినాదాలు చేస్తారు. వసుధార గురించి అడిగితే.. పర్సనల్ పనిమీద ఉందని, కచ్చితంగా వస్తుంది అని మహేంద్ర నచ్చచెప్పాలని చూస్తాడు. కానీ వాళ్లు వినరు. వసుధార ఎండీ అయిన తర్వాత తమకు జీతాలు కూడా పడటం లేదని లెక్చరర్స్ ఆరోపిస్తారు. జీతాలు కూడా ఇవ్వకుంటే మేం ఎలా బతకాలి? వసుధార మేడమ్ సంతకాలు పెట్టకుంటే మాకు జీతాలు రావు.. అప్పటి వరకు మేం ఆగము అని అంటారు. రిషి సర్ కావాలి అని కొందరు నినాదాలు చేస్తారు. రిషి కనిపించడం లేదు అని మహేంద్ర నచ్చచెప్పాలని చూస్తాడు. కానీ... రిషి సర్ చనిపోయాడని, మాకు తెలుసు అంటూ ఆ స్టూడెంట్ అంటాడు. అది విని మహేంద్ర షాకౌతాడు.

Guppedantha Manasu

లెక్చరర్స్ సైతం... రిషి సర్ మామూలు మనిషి కాదని, అలాంటి వ్యక్తి కనిపించకపోవడం ఏంటి అని నిలదీస్తారు. సమాధానం చెప్పలేక మహేంద్ర... రిషి ఎక్కడున్నాడో తనకు తెలీదు అని చెబుతాడు. దీంతో.. శైలేంద్ర తాను డబ్బులు ఇచ్చిన స్టూడెంట్ కి సైగ చేస్తాడు. వెంటనే ఆ స్టూడెంట్..  కనీసం రిషి సర్ ని మాతో మాట్లాడమని, వీడియో కాల్ చేసి చూపించమని అడుగుతాడు. కష్టం అని మహేంద్ర అంటే.. ఆ స్టూడెంట్.. మీరు అబద్దాలు చెబుతున్నారు.. నిజంగానే రిషి సర్ చనిపోయారు అని అంటాడు. ఆ మాటకు మహేంద్ర కోపంతో.. సీరియస్ అవుతాడు. తన కొడుకు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటాడు అంటే.. రిషి ఫోటో మీద RIP( REST in Piece)అని రాసి ఉన్న ఫోటో చూపిస్తాడు. ఇదెందుకు కాలేజీ గ్రూప్ లో వచ్చింది అని అడుగుతారు.

Latest Videos


Guppedantha Manasu

అయితే... ఈ ఫోటో అబద్దం అని, రిషి కి క్షేమంగా ఉన్నాడని, త్వరలోనే కాలేజీకి వస్తాడు అని మహేంద్ర చెబుతాడు. పక్కనుండి శైలేంద్ర మాత్రం.. చెప్పండి బాబాయ్.. స్టూడెంట్స్ అడుగుతున్నారు కదా అని ఇంకాస్తా స్టూడెంట్స్ ని రెచ్చగొట్టాలని మాట్లాడుతూ ఉంటాడు. కానీ.. మహేంద్ర.. ప్రస్తుతం రిషి ఎక్కడ ఉన్నాడో తెలీదు కానీ... కచ్చితంగా కాలేజీకి  వస్తాడని.. వసుధార కూడా కాలేజీకి వస్తోందని.. లెక్చరర్స్ కి జీతాలు ఈ రోజే పడతాయని హామీ ఇస్తాడు. శైలేంద్ర సైగతో .. ఆ స్టూడెంట్.. తాము ఇప్పుడైతే  క్లాసులకు వెళ్తాం అని, కానీ.. త్వరలోనే రిషి సర్ కాలేజీకి రావాలి అని చెప్పి వెళ్లిపోతారు.

Guppedantha Manasu

స్టూడెంట్స్ గొడవ చేయడంతో.. ఈ విషయాన్ని వసుధారకు చెప్పమని మహేంద్ర తో ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత.. అసలు.. ఈ రూరమ్ ఎలా స్ప్రెడ్ అయ్యిందని ఫణీంద్రకు అనుమానం వస్తుంది. వెంటనే శైలేంద్ర ఓవర్ యాక్టింగ్ మొదలుపెడతాడు.. రిషి సమాచారాం తెలీకపోతే.. ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తామో అని భయంగా ఉంది అంటాడు.


ఆ మాటలకు మహేంద్రకు కోపం వస్తుంది. పక్కకు వెళ్లి.. కోపంతో  చెట్టును కొడుతూ ఉంటాడు. వాళ్ల మాటలు తలుచుకొని మరింతగా చెట్టును కొడుతూ ఉంటాడు. కానీ, అనుపమ వచ్చి ఆపుతుంది. జరుగుతున్నది చూస్తుంటే.. నాకు పిచ్చి పట్టేలా ఉంది అని మహేంద్ర అంటాడు. బతికి ఉండగానే.. తన కొడుకును  చనిపోయాడంటూ ప్రచారం చేస్తున్నారని, అది చూస్తుంటే.. నా గుండె పగిలిపోయినట్లుగా ఉందని మహేంద్ర బాధపడతాడు. ఎలా ఉండాల్సిన తన కొడుకు.. ఎలా అయిపోయాడని, రిషి గురించి అలా పెట్టడం ఏంటి అని అనుపమ అని మహేంద్ర అంటాడు.
 

Guppedantha Manasu

దానికి, అనుపమ.. మహేంద్రకు సర్దిచెబుతుంది.  బాధలో అందరూ బాధపడతారని, కానీ ఆ బాధకు కారణమైన సమస్యను పరిష్కరించేవాడే ఉత్తముడు అని చెబుతుంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి కానీ.. నిన్ను నువ్వు బాధపెట్టుకుంటే.. నీకు ఏదైనా జరిగితే.. ఎవరికి నష్టం..? నీ కొడుకు, కోడలికి నష్టం.. ఆ శైలేంద్ర కు మాత్రమే లాభం జరుగుతుంది అని  అనుపమ గట్టిగా క్లాస్ పీకుతుంది. తర్వత.. స్టూడెంట్స్  ఇలా చేయడానికి కారణం కూడా శైలేంద్రే అని అనుపమ అనుమానం వ్యక్తం చేస్తుంది.  శైలేంద్ర ఆలోచనలు తిప్పికొట్టమని సలహా ఇస్తుంది. జగతి ఉంటే.. ఇలానే సమస్య పరిష్కరించేలా ఆలోచించేదని, నువ్వు కూడా అలానే ఆలోచించాలి అని.. మహేంద్రకు ధైర్యం నూరిపోస్తుంది. కానీ..మహేంద్ర తాను మానసికంగా డౌన్ లో ఉన్నాను అని ఫీలౌతాడు. శైలేంద్రను ఎదుర్కోలేకపోతున్నాను అని మహేంద్ర అంటాడు. అయితే... ఎదురెదురుగా యుద్ధం చేయడం కాదు.. అతని ఆలోచనలకంటే.. ముందుగా ఆలోచించాలి.. అంటే.. దేని కోసం ఇదంతా చేస్తున్నాడనే విషయం మనకు తెలియాలి అని అనుపమ అంటుంది.

రిషి ఆచూకీ కనుక్కోవడానికి ఇలా చేస్తున్నాడని.. మహేంద్ర అంటాడు. పెద్ద ఇష్యూ చూస్తే.. రిషి కచ్చితంగా బయటకు వస్తాడని ఇలా చేస్తున్నాడు అని మహేంద్ర అంటాడు.. అయితే.. అది జరగకుండా చేద్దాం అని అనుపమ అంటుంది. మరి దీనికి... పరిష్కారం ఏంటి, స్టూడెంట్స్ ఇచ్చిన డెడ్ లైన్ లోగా ఏం చేయాలి అని మహేంద్ర అడుగుతాడు. రిషి నే ఈ సమస్యకు పరిష్కారం చెబుతాడని అనుపమ అంటుంది. వసు కి ఫోన్ చేయమని అంటుంది. వసుకి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది.
 

Guppedantha Manasu

ఈలోగా.. మంత్రి నుంచి మహేంద్రకు ఫోన్ వస్తుంది. ఆయన కాలేజీకి వస్తున్నాను అని చెబుతాడు. మరోసారి వసుధారకు ఫోన్ చేస్తే.. లిఫ్ట్ చేస్తుంది.  రిషి సర్  దగ్గరకు వెళ్తున్నాను అని చెబుతుంది. మేం కూడా వస్తాం అని మహేంద్ర అంటే.. వద్దు అని.. శైలేంద్ర మన ఫోన్లు ట్యాప్ ఛేస్తే.. రిషి సర్ ఆచూకీ తెలిసిపోతుందని, చాలా ప్రమాదంలో పడతాం అని వద్దు అని చెబుతుంది. కానీ.. మహేంద్ర.. కాలేజీలో జరిగిన గొడవ గురించి చెబుతాడు. రిషి గురించి తెలుసుకోవాలని ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నాడని.. లెక్చరర్స్ కూడా శాలరీ కోసం గొడవ చేస్తున్నారని, కాలేజీ గ్రూప్ లో రిషి ఫోటో కింద రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టారని, రిషి గురించి చెప్పకుంటే పరీక్షలు రాయమని స్టూడెంట్స్ అంటున్నారని.. మొత్తం చెబుతాడు. అయితే.. ఈ సమస్యకు తాను పరిష్కరం గురించి ఆలోచిస్తానని చెబుతుంది. శాలరీ ఫైల్ తాను అప్రూవ్ చేస్తానని.. సిలబస్ పూర్తి చేయమని లెక్చరర్స్ కి చెప్పమని అంటుంది.. తాను ఇప్పుడు కాలేజీకి వస్తానని.. రిషి దగ్గరకు తర్వాత వెళతాను అని చెబుతుంది.

Guppedantha Manasu

మరోవైపు దేవయాణి... రిషి ఫోటో చూసి.. ఇలా తన కొడుకే చేసి ఉంటాడని.. ఈ ఫోటోతో కాలేజీలో కలకలం సృష్టించి ఉంటాడు అని తెగ సంబరపడిపోతుంది. ఇదే విషయాన్ని తన కొడుకును అడిగి తెలుసుకోవాలి అని.. శైలేంద్రకు ఫోన్ చేస్తుంది. అదే ఫోన్ చూసి అడుగుతుంది.  సంబరంగా.. ఈ విషయాన్ని తల్లితో శైలేంద్ర పంచుకుంటాడు. రిషి గురించి తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాళ్లు తెలియనివ్వడం లేదని.. ఇలా చేశాను అని  చెబుతాడు. స్టూడెంట్స్ రచ్చ చేస్తే.. బాబాయ్ నోటి నుంచి మాట రాలేదని.. ఇక రిషిని బయటకు తీసుకురావడం తప్ప.. మరో మార్గం లేదు అని శైలేంద్ర అంటాడు.

Guppedantha Manasu

ధరని అత్తయ్య అని పిలుస్తూ రావడంతో..ధరణి వస్తోందని.. దేవయాణి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత.. ధరణి వచ్చి.. రిషి ఫోటో చూపిచ్చి.. ఇలా ఎవరు చేశారు అని  అడుగుతుంది. నేను కూడా ఇప్పుడే చూశాను అని దేవయాణి చెబుతుంది. తాను శైలేంద్ర తో కూడా మాట్లాడానని.. కాలేజీలో స్టూడెంట్స్ ఇదే విషయంపై గొడవ చేశారని కూడా చెబుతుంది.  ఆ ఫోటోలో చూసిందే నిజమేమో అని దేవయాణి అంటే.. ఆ మాటలకు ధరణికి కోపం వస్తుంది. అలాంటి అపశకునం మాటలు ఎలా మాట్లాడతారు అని సీరియస్ అవుతుంది.

click me!