ఇక కత్తి పట్టుకున్నాడు కదా పిల్లాడు కోపిష్టి అవుతాడు లేదంటే పది మందికి మంచి చేసేవాడు అవుతాడు అని అప్పుడే మేము అనుకున్నాము. అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో ఉన్నాడు. ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు అతను చేస్తున్న పని చూసి చాలా సంతోషంగా ఉంది అన్నారు అంజనాదేవి.
ఈమధ్య పవన్ కళ్యాణ్ ఎక్కువగా దీక్షలు తీసుకుంటున్నాడు. అయితే అవి అతనికి క కొత్త కాదు అన్నారు అంజనాదేవి. పవన్‌కు చిన్నప్పుట్నుంచే ఆ అలవాటు ఉంది అన్నారు. పవన్ ఎంతో నిష్టగా అయ్యప్ప మాల వేసుకునేవాడని ఆమె చెప్పారు. అంతే కాదు ప్రత్యేకంగా తన కోసమే పనవ్ దీక్ష తీసుకున్నాడని అన్నారు పవన్ తల్లిగారు. అయ్యప్ప దర్శనానికి నేను వెళ్లాలి నాన్న అని ఓసారి అడిగితే.. నా కోసం అయ్యప్ప మాల వేసుకున్నాడు.
40 రోజులు నిష్టగా ఉన్నాడు. ఆ తర్వాత శబరిమల వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం' అని అంజనాదేవి తెలిపారు. ఈ స్థాయికి చేరుకోవడానికి పవన్ ఎంతో కష్టపడ్డాడని, ఎంత కష్టపడ్డాడో భగవంతుడు అంత మంచి అదృష్టం ఇచ్చాడని, ప్రజలకే సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాడని అంజనాదేవి ఆనందంతె వెల్లడించారు.
Also Read: సుబ్బరాజు భార్య బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా... ఏం చేస్తుంది.. ఎక్కడ ఉంటుంది..?