జూనియర్ ఎన్టీఆర్ ని సేవ్ చేసిన రాఘవేంద్రరావు.. లేకుంటే ఆ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ ?

First Published | Dec 2, 2024, 8:35 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నూనూగు మీసాల టీనేజ్ వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడని అందరికీ తెలుసు. విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో నిన్ను చూడాలని చిత్రంతో ఎన్టీఆర్ హీరోగా పరిచయం అయ్యారు. అయితే తొలి చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నూనూగు మీసాల టీనేజ్ వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడని అందరికీ తెలుసు. విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో నిన్ను చూడాలని చిత్రంతో ఎన్టీఆర్ హీరోగా పరిచయం అయ్యారు. అయితే తొలి చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఎన్టీఆర్ కి కూడా సరిగ్గా గుర్తింపు లభించలేదు. ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది. 

తొలి చిత్రంతోనే ఎదురుదెబ్బ తగిలింది. దీనితో రెండవ చిత్రంతో అయినా హిట్ కొట్టాలి. లేకుంటే కెరీర్ పై తీవ్ర ప్రభావం ఉంటుంది. అదే సమయంలో ఎన్టీఆర్ కెరీర్ ని నిలబెట్టేందుకు రాఘవేంద్ర రావు రంగంలోకి దిగారు. అప్పటికే మహేష్ బాబుని హీరోగా లాంచ్ చేసి రాఘవేంద్ర రావు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మరో వారసుడి కెరీర్ ని నిలబెట్టే భాధ్యత ఆయనపై పడింది. ఎన్టీఆర్ సెకండ్ మూవీగా స్టూడెంట్ నెంబర్ 1 ఫిక్స్ అయింది. అయితే రాఘవేంద్ర రావు తాను దర్శకత్వం వహించకుండా ఆ బాధ్యతలని తన శిష్యుడు రాజమౌళికి అప్పగించారు. తాను దర్శకత్వ పర్యవేక్షణ మాత్రం చేశారు. 

Also Read : దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్, ఒక్కడికి తప్ప అందరికీ షాక్.. విన్నర్ ఎవరో తెలిసిపోయింది ?


రాజమౌళికి అదే తొలి చిత్రం. రాజమౌళికి సాంగ్స్ పై పెద్దగా అవగాహన ఉండేది కాదట. రాఘవేంద్ర రావు మాత్రం సాంగ్స్ ని చిత్రీకరించడంలో, ట్యూన్ ని సెలెక్ట్ చేయడంలో దిట్ట. షూటింగ్ ప్రారంభానికి ముందే రాఘవేంద్ర రావు కొన్ని సాంగ్స్ కి కీరవాణితో కలసి ట్యూన్స్ ఫైనల్ చేశారు. కీరవాణి ఆ ట్యూన్ లని రాజమౌళికి వినిపించారు. స్టూడెంట్ నెంబర్ 1లో సూపర్ హిట్ అయిన సాంగ్స్ లో కాలేజ్ ఫేర్ వెల్ లో జరిగే.. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అనే పాట, అదే విధంగా పడ్డానండి ప్రేమలో మరి అనే సాంగ్స్ ఉన్నాయి. 

ఎక్కడో పుట్టి అనే సాంగ్ రాజమౌళికి పర్వాలేదనిపించింది అట. కానీ పడ్డానండి ప్రేమలో మరి అనే సాంగ్ అస్సలు నచ్చలేదట. కీరవాణితో.. అన్నయ్య ఏంటి ఈ పాట అస్సలు బాగాలేదు అని చెప్పాడట. కీరవాణి బదులిస్తూ.. లేదు రాజమౌళి, రాఘవేంద్ర రావు గారు సెలెక్ట్ చేశారంటే అందులో విషయం ఉంటుంది. సాంగ్ మంచి హిట్ అవుతుంది చూడు అని చెప్పారట. స్టూడెంట్ నెంబర్ 1 ఆడియో క్యాసెట్స్ విడుదలై ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయింది. పడ్డానండి ప్రేమలో మరి సాంగ్ ని యూత్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. అప్పడే అనుకున్నా.. ఓహో మనకి సాంగ్స్ లో జీరో నాలెడ్జ్ అంటూ రాజమౌళి నవ్వుతూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

NTR-Rajamouli

ఆ మూవీ విజయంలో సాంగ్స్ కూడా కీలక పాత్ర పోషించాయి. రాఘవేంద్ర రావు ఇన్వాల్వ్ మెంట్ లేకుంటే జక్కన్న స్టూడెంట్ నంబర్ 1 సాంగ్స్ ని ఏం చేసేవాడో.. ఆపై సినిమా రిజల్ట్ ఏమయ్యేదో మరి. ఆ తర్వాత రాజమౌళి చిత్రాల్లో ఎలాంటి సాంగ్ వచ్చినా అందులో రాఘవేంద్ర రావు స్టైల్ ఉంటుందని కామెంట్స్ వినిపిస్తుంటాయి. 

Latest Videos

click me!