బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ : ఒక్కో సీజన్‌లో ఎవరికెంత డబ్బు వచ్చిందో తెలుసా?

Published : Sep 01, 2025, 10:06 PM IST

Bigg Boss Telugu Winners Remuneration: బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే ఊహించని ట్విస్టులు, డ్రామా, ఎమోషనల్ అప్‌సెట్స్. అయితే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వరకు విజేతలు ఎవరు? వారు అందుకున్న రెమ్యునరేషన్ ? అనే వివరాలు చూద్దాం.

PREV
19
బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ వీరే

Bigg Boss Telugu Winners Remuneration: బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే ఊహించని ట్విస్టులు, డ్రామా, ఎమోషనల్ అప్‌సెట్స్. ఇలా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ షో ఆడియన్స్‌ను టీవీలకు అతుక్కునేలా చేస్తోంది. ప్రతి సీజన్‌కు పాపులారిటీ పెంచుకుంటూ ఇప్పటి వరకు తెలుగు 8 సీజన్లు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 రాబోతుంది. ప్రతి సీజన్‌లో గెలిచిన విజేతలు బిగ్ బాస్ టీమ్ భారీ ప్రైజ్ మనీ, గిఫ్టులు అందుకుంటున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వరకు విజేతలు ఎవరు? వారు అందుకున్న రెమ్యునరేషన్ ఎంత? అనే వివరాలు చూద్దాం.

29
బిగ్ బాస్ తెలుగు 1 విన్నర్ – శివ బాలాజీ

బిగ్ బాస్ తెలుగు స్టార్ట్ అయ్యింది 2017లో. ఫస్ట్ సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ తనహోస్టింగ్ తో బ్లాక్ బాస్టర్ హిట్ చేశాడు. ఎన్టీఆర్ చేసిన ఫస్ట్ సీజన్ అంతా సక్సెస్ మరే సీజన్ సాధించలేకపోయింది. ఇక బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా నటుడు శివ బాలాజీ నిలిచారు. ఇతడు బిగ్ బాస్ ప్రైజ్ మనీగా రూ. 50 లక్షలు అందుకున్నారు. తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోలకు ఇది ఒక పెద్ద ఆరంభం అని చెప్పాలి.

39
బిగ్ బాస్ తెలుగు 2 విన్నర్ – కౌశల్ మండా

బిగ్ బాస్ తెలుగు 2 వ సీజన్ 2018లో జరిగింది. ఈ సీజన్ కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. సీజన్ 2 విన్నర్ గా కౌశల్ విన్ అయ్యాడు. ఆయనకు ప్రైజ్ మనీ కింద రూ. 50 లక్షలు అందాయి. ఈ సీజన్ లో కౌశల్ చేసిన రచ్చ మామూలుగా లేదు. 

కౌశల్ బయట మనుషులను పెట్టి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు ఈ విషయంలో చాలా విమర్శలు ఫేస్ చేశాడు. ఆ తరువాత అసలు కనిపించకుండాపోయాడు కౌశల్. తనకు తాను పీపుల్స్ స్టార్అని ట్యాగ్ ఇచ్చుకుని విమర్శల పాలు అయ్యారు.

49
బిగ్ బాస్ తెలుగు 3 విన్నర్ – రాహుల్ సిప్లిగంజ్

బిగ్ బాస్ తెలుగు 3 సీజన్ 2019లో జరిగింది. ఈ సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్టింగ్ చేయడం ప్రారంభించారు. మూడో సీజన్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్‌ అయ్యారు. యాంకర్ శ్రీముఖి గట్టి పోటీ ఇచ్చి రన్నర్ గా నిలిచింది. , రాహుల్ తన సింపుల్ అండ్ స్ట్రైట్ గేమ్‌తో టైటిల్ అందుకున్నాడు. అతనికి రూ. 50 లక్షల ప్రైజ్ మనీ లభించింది.

59
బిగ్ బాస్ తెలుగు 4 విన్నర్ – అభిజీత్

2020లో కోవిడ్ కారణంగా జరుగుతుందా? లేదా? అనే సందేహాలు వచ్చాయి. బయట వ్యతిరేకంగా ఉన్నా.. ఆడియన్స్ మాత్రం అండగా నిలిచారు. దీంతో కోవిడ్ కాలంలో కూడా బిగ్ బాస్ 4 సక్సెస్‌ఫుల్‌గా కొనసాగింది.. నాగార్జున హోస్ట్‌గా చేసిన ఈ సీజన్‌లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజీత్ విన్నర్‌గా నిలిచాడు. అతనికి రూ. 25 లక్షల ప్రైజ్ మనీతోపాటు ఖరీదైన బైక్ లభించింది. అయితే, రన్నరప్ సయ్యద్ సోహైల్ మనీ ఆఫర్ తీసుకోవడంతో అతడు రూ. 25 లక్షలు సంపాదించాడు.

69
బిగ్ బాస్ తెలుగు 5 విన్నర్ – వీజే సన్నీ

2021లో జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో వీజే సన్నీ కప్పు గెలుచుకున్నాడు. నాగార్జున హోస్ట్ చేసిన ఈ సీజన్‌లో సన్నీ రూ. 50 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు. ఈ సీజన్ కూడా మంచి పాపులారిటీ సంపాదించింది. ఇక విన్నర్ వీజే సన్నీ బిగ్ బాస్ ఫేమ్ తో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు సన్ని. అలాగే కళ్యాణ వైభోగం వంటి పాపులర్ సీరియల్స్‌లో నటించారు.

79
బిగ్ బాస్ తెలుగు 6 విన్నర్ – సింగర్ రేవంత్

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విన్నర్ గా నిలిచాడు సింగర్ రేవంత్. రన్నర్ గా శ్రీహాన్ విన్ అయ్యాడు. అయితే.. ఈ సీజన్‌లో ప్రత్యేక ట్విస్ట్ ఉంది. రన్నరప్ శ్రీహాన్ గోల్డెన్ బ్రీఫ్‌కేస్ తీసుకోవడంతో అతనికి రూ. 40 లక్షలు దక్కాయి. దీంతో రేవంత్‌కు కేవలం రూ. 10 లక్షల ప్రైజ్ మనీ మాత్రమే దక్కింది. అయితే.. షో స్పాన్సర్ అతనికి మహీంద్రా కేయూవీ 100 కారు, రూ. 25 లక్షల విలువైన ల్యాండ్ లభించాయి. అయితే ఓటింగ్ బట్టి చూస్తే శ్రీహానే అసలైన విన్నర్ అని టాక్.

89
బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ – పల్లవి ప్రశాంత్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చాలా ప్రత్యేకం. కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి వచ్చి రచ్చ రచ్చ చేశాడు. ఫైనల్ గా టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఈ సీజన్‌లో అతడు రూ. 35 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు. ఇక రన్నర్ గా నిలిచి ప్రిన్స్ యావర్ మనీ ఆఫర్ తీసుకోవడంతో రూ. 15 లక్షలు తన ఖాతాలో వేసుకున్నాడు.

99
బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ – నిఖిల్ మలియక్కల్

ఇక లాస్ట్ ఇయర్ జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్ నిలిచాడు. చివరి వరకు గౌతమ్ విన్నర్ అవుతాడని బిగ్ బాస్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, నిఖిల్ విన్నర్ గా..గౌతమ్ రన్నర్ గా నిలిచాడు. దీంతో నిఖిల్ సీజన్ 8 విజేతగా ట్రోఫీ తో పాటు రూ. 55 లక్షల ప్రైజ్ మనీతోపాటు ఖరీదైన కారు గిఫ్ట్‌గా అందించారు.

Read more Photos on
click me!

Recommended Stories