త్రివిక్రమ్.. మొదటిసారి పాన్ ఇండియా మూవీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది. ఆదర్శ కుటుంబం మూవీ పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. మరి ఎంత నష్టాలను తీసుకొచ్చిందంటే?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. త్వరలో ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నారు. `ది గాడ్ ఆఫ్ వార్` పుస్తకం ఆధారంగా కుమారస్వామి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. త్రివిక్రమ్ చేయబోతున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. ఎస్ రాధాకృష్ణ, నాగవంశీ దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్న `డ్రాగన్` విడుదలయ్యాక ఈ సినిమా ఉంటుందట. మధ్యలో అనిల్ రావిపూడి సినిమా ఉండే అవకాశం ఉంది. అంటే ఇంకో ఏడాది పట్టే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు త్రివిక్రమ్‌కి పెద్ద షాక్ తగిలింది. వెంకటేష్ మూవీ రూపంలో పెద్ద దెబ్బ తగలడం గమనార్హం.
24
ఆదర్శ కుటుంబం రూపంలో దెబ్బ
త్రివిక్రమ్ ఇటీవల వెంకటేష్‌తో `ఆదర్శ కుటుంబం హౌజ్ నెంబర్ 47` చిత్రాన్ని రూపొందించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. నారా రోహిత్, నివేతా పేతురాజ్, సత్య వంటి వాళ్లు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 30 న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మొదటి వీకెండ్‌లో సత్తా చాటిన ఈ మూవీ ఆ తర్వాత డల్ అవుతూ వచ్చింది. అంతిమంగా డిజాస్టర్‌గా మిగిలింది. ఈ చిత్రం విడుదలై 19 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడు థియేటర్లో క్లోజింగ్‌కి చేరుకుంది. రేపటితో ఈ సినిమాని థియేటర్ల నుంచి ఎత్తేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మూవీకి కలెక్షన్లు ఎలా ఉన్నాయి? ఎంత నష్టాలను తీసుకొస్తుంది అనేది చూస్తే.
34
ఆదర్శ కుటుంబం కలెక్షన్లు
ఆదర్శ కుటుంబం మూవీ టోటల్‌గా 19 రోజుల్లో రూ. 75.11కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇండియా గ్రాస్ రూ.58.26కోట్లు, ఓవర్సీస్‌లో రూ.16.85కోట్లు రాబట్టింది. ఇక మంగళవారం ఈ చిత్రానికి రూ.13లక్షలు వచ్చాయి. సోమవారంతో పోల్చితే లక్ష పెరిగింది. కానీ ఇప్పుడు వస్తున్న కలెక్షన్లు థియేటర్ల ఖర్చులకే పరిమితమవుతుంది. నిర్మాతకు, బయ్యర్లకి వచ్చేది ఏం లేదని అంటున్నారు. ఓవరాల్‌గా ఈ మూవీ ద్వారా దాదాపు నలభై కోట్ల వరకు షేర్ వచ్చింది.
ఈ సినిమాకి సుమారు రూ.70 నుంచి కోట్ల బడ్జెట్ అయ్యిందట. రూ.63కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యిందని సమాచారం. అంటే ఈ మూవీ హిట్ కావాలంటే, బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.120కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు రావాలి. రూ.64కోట్ల షేర్ రావాలి. ఇప్పుడు నలభై కోట్ల వరకు వచ్చింది. ఇంకా రూ.24కోట్లు రావాలి. ఇప్పుడు వస్తున్న కలెక్షన్ల నుంచి జీరో షేర్. అంటే దాదాపు రూ.25కోట్ల వరకు నష్టాలను తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇది త్రివిక్రమ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్‌తో మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్న సమయంలో `ఆదర్శ కుటుంబం` డిజాస్టర్ త్రివిక్రమ్‌కి పెద్ద దెబ్బ అనే చెప్పాలి.