‘ముఫాస’గా మహేష్ గ్రీన్ సిగ్నల్ ....ఎంత పే చేస్తున్నారు?

First Published | Aug 17, 2024, 6:40 AM IST

 లయన్ కింగ్‌కి ప్రీక్వెల్ గా ‘ముఫాస’ అనే సినిమా తీసుకు రాబోతున్నారు. 

Mahesh Babu


త్వరలోనే  రాజమౌళి సినిమా సెట్ లోకి అడుగుపెట్టనున్న మహేష్  ఓ యానిమేషన్ సినిమాకు వాయిస్ ఇవ్వబోతున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. అదే  ‘ముఫాస’.హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ముఫాస సినిమాకి మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.  మహేష్ బాబుతో ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి అని మాగ్జిమం ఓకే చెప్పినట్లే అంటున్నారు. అయితే ఇందులో మహేష్ కు కలిసొచ్చేదేంటి, అలాగే డిస్నికు ప్రత్యేకంగా యాడ్ అయ్యే బెనిఫిట్ ఏమిటి


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ పాన్ వరల్డ్ మూవీ కోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకునే పనిలో ఉన్నాడు ఈ సూపర్ స్టార్ .  రాజమౌళి సినిమా పూర్తయ్యేదాకా కొత్త సినిమాలు కమిటవ్వరు మహేష్. అయితే ఈ లోగా తన ఫ్యాన్స్ ని ఆనంద పరచటానికి ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే  ‘ముఫాస’సినిమా కు తెలుగు వాయిస్ ఇవ్వటం. రాజమౌళి సినిమా వచ్చేసరికి గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. ఈక్రమంలో తన ఫ్యాన్స్ కు తను కనపడకపోయినా ఇలా వాయిస్ తో వారికి ఆనందం కలగచేయవచ్చు.



అలాగే పిల్లలు ఆల్రెడీ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఆ ఫ్యాన్ బేస్ ఇలాంటి యానిమేషన్  సినిమాల్లో తను భాగం అవ్వటం ద్వారా బాగా పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా డిస్నీవారు మహేష్ కనుక డబ్బింగ్ చెప్తే భారీగానే ముట్టచెప్తారు. ఆ మేరకు టాక్స్ జరుగుతున్నాయట. అక్కడ హిందీలో షారూఖ్ ఖాన్, ఇక్కడ మహేష్ ఇలా కేవలం సూపర్ స్టార్స్ ని మాత్రమే ఈ సినిమా వాయిస్ కు తీసుకుంటున్నారు. సూపర్ స్టార్స్ వాయిస్ చెప్తే ఆ సినిమా యాడెడ్ ఎడ్వాంటేజ్. సినిమా ప్రమోషన్ ఈజిగా అవుతుంది. అలాగే ఆ స్టార్స్ ఫ్యాన్స్ ఈ సినిమాను చూడటానికి ఎక్కువ ఉత్సాహం చూపెడతారు.
 


 ఇక   ‘ముఫాస’ విషయానికి వస్తే ...హాలీవుడ్ లో వచ్చిన యానిమేటెడ్ మూవీస్‌ లో  ప్రపంచవ్యాప్తంగా భారీగా సక్సెస్ అయ్యి  ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సినిమాలలో మొదటిది ‘ది లయన్ కింగ్’. అడివికి రాజు అయిన సింహం ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం చిన్న పిల్లల మనసు దోచుకుంది. 2019లో రిలీజ్ అయిన ‘ది లయన్ కింగ్’ వరల్డ్ వైడ్ గా రూ.166 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి దుమ్మురేపింది. హాలీవుడ్ యాక్షన్ సినిమాల స్దాయిలోనే  ఈ యానిమేటెడ్ మూవీకి సక్సెస్ అవ్వటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
 


దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా మరో సినిమాని తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే లయన్ కింగ్‌కి ప్రీక్వెల్ గా ‘ముఫాస’ అనే సినిమా తీసుకు రాబోతున్నారు. లయన్ కింగ్ సినిమాలోని సింబా తండ్రి అయిన ముఫాస కథతో ఈ సీక్వెల్ ఉండబోతుంది.  సాధారణ సింహం రాజుగా ఎలా మారిందనేది స్టోరీ. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. 


ఇప్పటికే టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి. దీంతో అభిమానులు అంతా ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేసే నిర్మాతలు ఈ సినిమాకి మరింత పాపులారిటీని తీసుకు రావడం కోసం మహేష్ బాబుని కూడా ఇందులో భాగం చేస్తే  మామూలుగా ఉండదు మరి.  కాగా మహేష్ బాబు గతంలో జల్సా, బాద్‌షా, ఆచార్య వంటి పలు తెలుగు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. హాలీవుడ్ సినిమాలకు అయితే ఇప్పటివరకు ఏ చిత్రానికి డబ్బింగ్ చెప్పలేదు.

Latest Videos

click me!