సీఎం అవ్వడమే టార్గెట్‌గా పవన్ పొలిటికల్‌ ఫిల్మ్?, అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేస్తున్న స్టార్‌ డైరెక్టర్‌ ?

First Published | Nov 2, 2024, 11:08 PM IST

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కావడమే లక్ష్యంగా పనిచేయబోతున్నారట. అందులో భాగంగా ఓ భారీ పొలిటికల్‌ ఫిల్మ్ చేయబోతున్నట్టు సమాచారం. 
 

pawan kalyan

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా, రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. పదేళ్ల క్రితం ఆయన జనసేన పార్టీని స్థాపించారు. పదేళ్లపాటు ఎలాంటి పదువులు లేకుండానే పోరాడాడు. ఓ వైపు సినిమాలు చేస్తూ, మరోవైపు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. పొలిటికల్‌ హీట్‌ ఉన్నప్పుడు సినిమాలు పక్కన పెట్టి పూర్తిగా పాలిటిక్స్ పైనే దృష్టిపెట్టాడు. ఆ తర్వాత సినిమాలు చేసుకుంటూ వచ్చారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

2014లో బీజేపీ, టీడీపీకి కూటమికీ సపోర్ట్ చేశారు పవన్‌. 2019లో వామపక్షాలతో కలిసి సోలోగా పోటీ చేశారు. కానీ ఒక్క చోట మాత్రమే గెలిచారు. ఆయన కూడా రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి. గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన పవన్‌, ఆ ఓటమి నుంచి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకున్నారు. ఈ సారి అలా జరగకుండా మళ్లీ ఎన్డీయే(బీజేపీ-టీడీపీ-జనసేన)తో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగారు.

రెండు ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించింది. వంద శాతం సక్సెస్‌ రేటు చూపించి సంచలనం సృష్టించారు. ఇదొక రికార్డుగానూ చెప్పొచ్చు. ప్రభుత్వంలోనూ భాగమయ్యారు. డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా మారారు పవన్‌. 

Latest Videos


Pawan Kalyan

ఓ వైపు డీప్యూటీ సీఎంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే టైమ్‌ దొరికినప్పుడు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. తనకు ఈ స్థాయిని, ఈ క్రేజ్‌ని తీసుకొచ్చింది సినిమాలే. అందుకే దాన్ని వదలకుండా కంటిన్యూ చేయాలనుకుంటున్నారట పవన్. అందులో భాగంగా ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు.

ప్రస్తుతం ఆయన `హరిహర వీరమల్లు` సినిమా షూటింగ్‌ని ఇప్పటికే ప్రారంభించారు. కొన్ని రోజులు షూటింగ్‌లోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన లేని సన్నివేశాలను షూట్‌ చేస్తున్నారట. ఇది హిస్టారికల్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ కావడం విశేషం. పవన్‌ చేస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ ఇదే. 

Deputy CM Pawan Kalyan

దీంతోపాటు `ఓజీ` సినిమాని కూడా పూర్తి చేయాలని భావించారు పవన్‌. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌లో కూడా ఆయన పాల్గొనబోతున్నారట. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్‌ని కూడా త్వరలోనే పూర్తిచేయాలనుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`పై ఫోకస్‌ చేయబోతున్నారట. ఇలా టైమ్‌ కుదిరినప్పుడలా సినిమాలు చేయాలనుకుంటున్నారట పవన్‌. 

ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలే కాదు, కొత్త సినిమాలు కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. కొత్తగానూ పలు సినిమాలకు ఓకే చెప్పే అవకాశం ఉందట. అయితే తనకు పాజిబుల్‌ టైమ్‌ లో షూటింగ్ లు జరిపే సినిమాలకే ఆయన ప్రయారిటీ ఇవ్వబోతున్నారు. ఇదిలా ఉంటే పవన్‌ మరో భారీ సినిమాకి ప్లాన్‌ జరుగుతుందట. పవన్‌ కళ్యాణ్‌ ఓ పొలిటికల్‌ ఫిల్మ్ చేయబోతున్నారట.

త్రివిక్రమ్‌ అందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీని హారిక అండ్‌ హాసిని ప్రొడక్షన్‌ నిర్మించే అవకాశం ఉంది. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ తెలిపారు. తమ బ్యానర్‌లో ఓ పెద్ద హీరోతో పొలిటికల్‌ ఫిల్మ్ ప్లాన్‌ చే్స్తున్నామని, 2029 ఈమూవీ ఉంటుందని ఆ వివరాలు ఆ టైమ్‌లోనే వెల్లడిస్తామని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్  త్రివిక్రమ్‌- పవన్‌ కాంబోలో రాబోతున్న సినిమా అని, అదే పొలిటికల్‌ ఫిల్మ్ అని తెలుస్తుంది. దీంతో ఇది ఇటు సోషల్‌ మీడియాలో, అటు ఇండస్ట్రీలో డిస్కషన్‌గా మారింది. 
 

Pawan Kalyan- Trivikram

అయితే పవన్‌ నెక్ట్స్ ఎన్నికల్లో సీఎం కావడమే లక్ష్యంగా పనిచేయబోతున్నాడని, అందులో భాగంగానే ఈ పొలిటికల్‌ ఫిల్మ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్‌ ఎన్డీఏ(బీజేపీ, టీడీపీ)తో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అయితే చంద్రబాబు, లేదంటే లోకేష్‌ సీఎం అభ్యర్థిగా ఉంటారు. తనకుఛాన్స్ ఉండదు. అందుకే ఈ కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.

బీజేపీతో కలిసి ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని, తానే సీఎం అభ్యర్థిగా ఉండబోతున్నారని, ఇదంతా ఓ ప్లానింగ్‌ ప్రకారంగా పవన్‌ ముందుకు వెళ్లబోతున్నారని, అందుకే రాజకీయంగా జనంలో బలమైన ఇంపాక్ట్ చూపించేలా ఓ పొలిటికల్‌ ఫిల్మ్ చేయాలనుకుంటున్నారట. ఆ బాధ్యత త్రివిక్రమ్‌కి అప్పగించినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా? నిర్మాత నాగవంశీ చెప్పింది ఈ మూవీ గురించేనా? అనేది తెలియాల్సి ఉంది. 

Read more: పవన్‌ కళ్యాణ్‌, సౌందర్య చేయాల్సిన సినిమా ఏంటో తెలుసా? ఎలా మిస్‌ అయ్యింది? పవన్‌ భయపడ్డాడా?

Also read: బాలయ్యతో గొడవ, ఎన్టీఆర్‌ రియాక్షన్‌ ఇదే.. దీనికోసమా ఫ్యాన్స్ కొట్టుకునేది?

click me!