గత కొన్నేళ్లుగా చాలా మంది హీరోలు విడుదల రోజున థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం మానేశారు. నాకు తెలిసి చిరంజీవి ముఖానికి మాస్క్ వేసుకుని, ఎవరికీ కనపడకుండా ఒక్కరే వెళ్లి సినిమా చూసి వచ్చేవారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట (Sandhya Theatre Stampede) ఘటన అందరినీ కలిచి వేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఘటనలో , సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) రీసెంట్ గా స్పందించారు.
ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...తాను థియేటర్ కు వెళ్లి సినిమాలు చూడటం ఎందుకు మానేసానో చెప్పుకొచ్చారు. ప్రతి నటుడు ప్రేక్షకుడి నుంచి ప్రశంసలు కోరుకుంటాడని, అందుకే మొదటి రోజున థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తాడని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు.
27
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ....‘‘నేను థియేటర్‌కు వెళ్లి సినిమా చూడను. ప్రేక్షకుల అనుభూతిని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. నేను నటించిన మూడో సినిమా తర్వాత థియేటర్‌కు వెళ్లడం మానేశా. సినిమా విడుదలైన రోజు ప్రతీ నటుడికి పరీక్ష సమయం. బహుశా ఆయన అందుకే థియేటర్‌కు వెళ్లి ఉంటారు.
ఏ నటుడైనా ఎందుకు థియేటర్‌కు వెళ్లాలనుకుంటాడో తెలుసా? సినిమా బాగాలేకపోతే తిడతారు. అలాగే బాగుంటే ప్రశంసిస్తారు. అందరికీ స్తుతించడం కావాలి. దేవుడిని కూడా మనం స్తుతిస్తాం. ‘నువ్వు గొప్పవాడివి స్వామి’ అని పొగుడుతాం. మీరు (మీడియావారు) ఆర్టికల్ రాస్తే, ‘బాగుంది’ అంటే సంతోషపడతారు. నటుడు కూడా తన నటనకు ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారో చూడాలనుకుంటారు. వాళ్ల నుంచి వచ్చే ప్రశంస వెలకట్టలేం’’
37
అంతెందుకు ‘‘ అలాగే, గత కొన్నేళ్లుగా చాలా మంది హీరోలు విడుదల రోజున థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం మానేశారు. నాకు తెలిసి చిరంజీవి ముఖానికి మాస్క్ వేసుకుని, ఎవరికీ కనపడకుండా ఒక్కరే వెళ్లి సినిమా చూసి వచ్చేవారు.
ఇప్పుడు కెమెరాలు పెరగడం వల్ల కుదరలేదు. నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే, జనాలు నన్ను చూడటానికి, ఒకరిపై ఒకరు పడిపోతుంటారు. కొన్నిసార్లు నాకు బందోబస్తుగా వచ్చిన పోలీసులు, కవరేజ్‌కు వచ్చిన విలేకరులు నలిగిపోతుంటారు.
47
హీరోలు, నాయకులు బయటకు వచ్చి అభివాదం చేయకపోతే, పొగరనుకుంటారు. చేయి ఊపడం ఎంజాయ్ చేయడం కాదు. ఇటీవల నేను విజయనగరం ప్రాంతంలో తిరుగుతుంటే, ప్రతి నాలుగు కిలోమీటర్లకు పోలీసులు వచ్చి ‘మీరు ఆగాలి.. ఇక్కడే ఆగిపోవాలి’ అనడం మొదలు పెట్టారు. నేను ఉత్సాహంతో వెళ్లడం వేరు. నాతో పాటు అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. దారి మధ్యలో ల్యాండ్‌మైన్స్ ఉండొచ్చు. సడెన్‌గా ఎవరైనా కాల్పులు జరపవచ్చు. నకిలీ ఐపీఎస్ ఉండొచ్చు ’’ అన్నారు.
57
ఇక ‘‘ఒక పరిశ్రమ కావాలంటే, దానికొక స్టేటస్ ఉంది. ఇటీవల టూరిజానికి ఇచ్చాం. ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా అది రావాలి. వాళ్లు కూడా కొన్ని తప్పులు సరిదిద్దుకోవాలి. క్రమశిక్షణగా ఉండాలి. చెప్పే కథలు, మార్కెటింగ్, ఉపాధి ఇలా అన్నీ చూసుకోవాలి. చాలా సంస్కరణలు చేయాలి.
ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఒక్కో జిల్లాకు ఒక్కో వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలోనూ ఉన్న వాళ్లలో అనేక రకాల నేపథ్యాలు కలిగి ఉన్నారు. అంతా ఒక్కటి కావాలి.’’అన్నారు.
67
Pawan Kalyan
వీటితో పాటు ‘‘సినిమాలే కాదు, టెలివిజన్ మీడియాలోనూ క్వాలిటీ పెంచాలి. అందుకే నేను పర్యటనలు చేసి, అవసరమైన ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. పాతిక లక్షల బడ్జెట్ పెట్టుకుంటే, ఏపీలో ఎక్కడెక్కడ షూటింగ్ తీసుకుంటే ఆ బడ్జెట్ సరిపోతుందో, చెప్పేలా ఒక బుక్‌లెట్ తీసుకురావాలన్నది ఆలోచన. ఫిల్మ్ ఇండస్ట్రీలో టెక్నికల్ టీమ్ పెరగాలి. క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్ పెరగాలంటే, పోటీ కూడా ఉండాలి’’అని చెప్పుకొచ్చారు.
77
Pawan Kalyan
‘‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గ్లోబల్‌గా మరింత రాణించాలంటే మానవ వనరుల అభివృద్ధి లేకుండా అది జరగదు. మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతమందికి సాహిత్యంపై అవగాహన ఉంది? గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ ఎంతమందికి తెలుసు? ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వాలకు ఎంతో ఆదాయం వస్తుంది. అలాగే, ఇండస్ట్రీ ఎంతో మందికి ఉపాధినీ కల్పిస్తోంది. సాహిత్యం నేపథ్యంతో కూడిన స్కూల్స్, స్టోరీ టెల్లింగ్, కల్చరల్ స్కూల్స్ రావాలి’’ అని పవన్‌కల్యాణ్ అభిప్రాయపడ్డారు.