‘పుష్ప 2’ మరో రికార్డు: ఓవర్ సీస్ కలెక్షన్స్‌ లెక్కలు

First Published | Dec 31, 2024, 6:02 AM IST

‘పుష్ప 2: ది రూల్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొడుతోంది మరియు ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది.

Pushpa 2: The Rule, Overseas Box Office , allu arjun


ఇండియన్ సినీ హిస్టరీలో కమర్షియల్‌ సినిమాకు సరికొత్త నిర్వచనాన్ని చెబుతూ దూసుకుపోతోంది ‘పుష్ప2: ది రూల్‌’ (Pushpa 2: The Rule). బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు రాబట్టే విషయంలో ‘పుష్పరాజ్‌’  వేగాన్ని అందుకోవటం ఎవరి వల్లా కావటం లేదు.  

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా  రికార్డ్ లు బ్రద్దలు కొడుతోంది.  ఇప్పటికే  ‘కేజీయఫ్‌2’ (రూ.1250 కోట్లు), ‘RRR’ (రూ.1,387 కోట్లు) ఆల్‌టైమ్‌ కలెక్షన్లు దాటేసిన ‘పుష్ప2’.. ‘బాహుబలి2’ (రూ.1810 కోట్లు) వసూళ్లను దాటే దిశగా వెళ్తోంది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓవర్ సీస్ లో ఎలా పే చేస్తోందో చూద్దాం.
 

 ‘పుష్ప 2’ చిత్రం ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లు సాధిస్తూ ముందుకు వెళ్తోంది.  2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్‌’కు కొనసాగింపుగా ‘పుష్ప 2: ది రూల్‌’ (Pushpa 2 The Rule) రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక, భన్వర్‌సింగ్‌ షెకావత్‌గా ఫహద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌, జగపతి బాబు కీలక పాత్రల్లో మెప్పించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి కొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
 



 ‘పుష్ప 2’ చిత్రం  ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్లతో సహా మొదటి ఇరవై ఐదు రోజుల్లో $30.96 మిలియన్ల గ్రాస్ వసూలు చేసింది. డిసెంబరు 20 & 25 తేదీల్లో మూడు కొత్త హాలీవుడ్  రిలీజ్ లు, మూడు ఇతర ప్రముఖ హాలీవుడ్ సినిమాలతో పాటు పండుగ సీజన్‌లో దాదాపు ఓవర్సీస్ దేశాల్లో పుష్ప 2 స్క్రీన్ కౌంట్‌పై ప్రభావం చూపించింది.

అయినప్పటికీ లిమిటెడ్  స్క్రీన్‌లలో పుష్ప 2 చాలా బాగా వసూళ్లు సాధిస్తోంది. కాకపోతే హాలీవుడ్‌లో ఎక్కువ  రిలీజ్ ల కారణంగా హాలిడే సీజన్‌లో పుష్ప 2 కు రావాల్సిన కలెక్షన్స్  భారీ కౌంట్  తగ్గిపోయింది.  ఇరవై ఐదు రోజుల్లో  $30.96  మిలియన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో  ₹265 కోట్ల గ్రాస్ సాధించి రికార్డ్ నెలకొల్పింది. 
 


మరో ప్రక్క  తక్కువ సమయంలో రూ. 1700 కోట్ల క్లబ్‌లో చేరిన భారతీయ చిత్రంగా ‘పుష్ప 2’ (Pushpa 2) రికార్డు నెలకొల్పింది. 2024లో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన సినిమాగానూ ‘పుష్ప 2’ టాప్‌లో ఉంది. ఆరు రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ సినిమాగా, హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘పుష్ప 2’ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా మూవీ ఈ నెల 5న బాక్సాఫీసు ముందుకొచ్చింది.


హిందీలోనే రూ. 700 కోట్లకుపైగా (నెట్‌) కలెక్షన్స్‌ రాబట్టిన ఈ సినిమా కొన్ని రోజుల నుంచి అక్కడ త్రీడీ వెర్షన్‌లోనూ ప్రదర్శితమవుతోంది.  ఇలా వసూళ్ల హవా కొనసాగిస్తున్న ‘పుష్ప 2’ ఓటీటీకి (Pushpa 2 OTT) వచ్చేస్తుందంటూ సోషల్ మీడియా  వేదికగా ఇటీవల వార్తలు ట్రెండ్‌ అయ్యాయి. జనవరి రెండో వారం నుంచి స్ట్రీమింగ్‌ కానుందంటూ చర్చ సాగింది. ఆ వార్తలపై చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం స్పందించింది. 56 రోజుల (థియేటర్లలో విడుదలైన నాటి నుంచి) కంటే ముందు ఏ ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజ్‌ కాదని స్పష్టం చేసింది.

Latest Videos

click me!