వార్ 2 లో ఎన్టీఆర్ రోల్ అలా ఉంటుందా? ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే అప్డేట్!

Published : Dec 30, 2024, 11:47 PM IST

హీరో ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. దేవర మూవీతో భారీ బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న వార్ 2 చిత్రం పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.   

PREV
15
వార్ 2 లో ఎన్టీఆర్ రోల్ అలా ఉంటుందా? ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే అప్డేట్!

టెంపర్ అనంతరం ఎన్టీఆర్ కి ప్లాప్ లేదు. తొమ్మిదేళ్లుగా ఆయన వరుస విజయాలు నమోదు చేస్తున్నాడు. వీటిలో ఆర్ ఆర్ ఆర్, దేవర భారీ విజయాలు అందుకున్నాయి. రామ్ చరణ్-ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 
 

25

సాధారణంగా రాజమౌళి సెంటిమెంట్ కి ఆయన హీరోలు బలి అవుతూ ఉంటారు. రాజమౌళితో మూవీ చేసిన ప్రతి హీరో నెక్స్ట్ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ కూడా ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఫేస్ చేశాడు. ఆచార్య మూవీ రూపంలో భారీ డిజాస్టర్ పడింది. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన మొదటి హీరో ఎన్టీఆర్. దేవర వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

 

35
JNTR

హిందీలో సైతం దేవర చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. దేవర హిందీ వెర్షన్ రూ. 60 కోట్ల వరకు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఎన్టీఆర్ దాదాపు నాలుగేళ్లు కేటాయించాడు. మరో రెండేళ్ల సమయం దేవర విడుదలకు పట్టింది. ఆరేళ్లలో ఎన్టీఆర్ చేసింది కేవలం రెండు సినిమాలే. ఇకపై వీలైనంత త్వరగా చిత్రాలు చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. 

45
NTR

అయాన్ ముఖర్జీ దర్శకుడిగా ఉన్నాడు. వార్ 2 మూవీలో ఎన్టీఆర్ రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ పాత్ర రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగి ఉంటుందట. రా ఏజెంట్ గా పాజిటివ్ యాంగిల్ లో అలాగే నెగిటివిటీతో కూడిన మరో యాంగిల్ ఆ రోల్ కలిగి ఉంటుందట. ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గతంలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేశారు. జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేశాడు. జై, లవ పాత్రలు నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటాయి. 


 

55

వార్ 2 లో ఆ తరహా పాత్ర ఎన్టీఆర్ ట్రై చేస్తున్నాడు అనేది తాజా సమాచారం. వార్ 2 అనంతరం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. త్వరలో పట్టాలెక్కనుంది. డ్రగ్ మాఫియాలో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామా అంటూ ప్రచారం జరుగుతుంది. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 2026లో ఈ మూవీ విడుదల కానుంది... 

Read more Photos on
click me!

Recommended Stories