'ఓజి' మూవీ స్టోరీ ఇదేనా, పవన్ కోసం ఏం కథ రాశావు సుజీత్ భయ్యా.. ఓజాస్ గంభీర ఊచకోత గ్యారెంటీ ?

Published : Aug 31, 2025, 03:12 PM IST

పవన్ కళ్యాణ్ ఓజి మూవీ రిలీజ్ కి ఇంకా 25 రోజుల సమయం ఉంది. కానీ అప్పుడే ఓజి ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక వైపు యుఎస్ లో ఓజి అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు మొదలయ్యాయి. మరోవైపు ఓజి కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

PREV
15

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి చిత్రం సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ కి 25 రోజుల ముందు నుంచే యుఎస్ లో ఈ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఇప్పటికే ఓజి చిత్రం దాదాపు 7 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఓజి మూవీపై అభిమానులు ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

25

తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనితో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ చిత్ర కథ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓజి కథ ఇదే అంటూ కొందరు పోస్ట్ లు పెడుతున్నారు. 

35

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓజి స్టోరీ లైన్ నిజమైతే బాక్సాఫీస్ ఊచకోత ఖాయం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఆ స్టోరీ లైన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముంబై అండర్ వరల్డ్ డాన్ అయిన ఓజాస్ గంభీర కొన్ని కారణాల వల్ల మాయమైపోతాడు. పదేళ్ల పాటు రహస్యంగా ఉంటాడు. పదేళ్ల తర్వాత తిరిగి ముంబైకి వస్తాడు. ఓజాస్ వచ్చే సమయానికి ముంబై అండర్ వరల్డ్ ని ఓమి భావు (ఇమ్రాన్ హష్మీ) హస్తగతం చేసుకుని ఉంటాడు. 

45

అతడిని అంతం చేసి ఓజాస్ గంభీర తానా సింహాసనంపై తిరిగి ఎలా కూర్చున్నాడు అనేదే కథ. గతంలో ఓజాస్ ముంబై నుంచి వెళ్లిపోవడానికి కారణం తన చుట్టూ ఉన్న వారు పొడిచిన వెన్నుపోటే. తిరిగి వచ్చాక వారందరినీ ఓజాస్ ఊచకోత కోసే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయని ఇన్సైడ్ టాక్. తనకి నమ్మక ద్రోహం చేసిన వారిని గుర్తించడం.. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం అంతం చేసే సీన్లు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయట. 

55

పేపర్ మీద చూడడానికి ఈ కథ బావుంది. కానీ సుజీత్ ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు అనేదే కీలకం. ఎంత బాగా సుజీత్ అవుట్ పుట్ రాబట్టి ఉంటే బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ అంత ఎక్కువగా ఉంటుంది అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మూవీలో శ్రీయ రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. 

Read more Photos on
click me!

Recommended Stories