OG Collections: సంక్రాంతికి వస్తున్నాం రికార్డులు బద్దలుకొట్టిన ఓజీ.. 2025లో ఇదే నెంబర్‌ వన్‌

Published : Oct 05, 2025, 10:56 PM IST

'ఓజీ' బాక్సాఫీస్‌ డే 11: పవన్ కళ్యాణ్ 'ఓజీ' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.  ఈ మూవీ తాజాగా వెంకటేష్‌ హీరోగా వచ్చిన `సంక్రాంతికి వస్తున్నాం` రికార్డులను బ్రేక్‌ చేసింది.

PREV
14
ఓజీ బాక్సాఫీసు సునామీ

పవన్ కళ్యాణ్ 'ఓజీ' సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సుజీత్ దర్శకత్వంలో 'ఫైర్‌స్టార్మ్ ఆఫ్ ముంబై' ట్యాగ్‌లైన్‌తో ఈ యాక్షన్ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. భారీ హైప్‌ తో విడుదలైన సినిమాకి విశేష ఆదరణ దక్కింది. పవన్‌ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. సినిమాని బాగా ఎంజాయ్‌ చేశారు. ఆ రెస్పాన్స్ ఓపెనింగ్స్ లో కనిపించింది. వసూళ్ల పరంగా ఈ చిత్రం దుమ్ములేపుతుంది. తాజాగా ఇది సరికొత్త రికార్డుని క్రియేట్‌ చేసింది.  తెలుగులోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది హైయ్యెస్ట్ గ్రాసర్‌గా `ఓజీ` మూవీ నిలవడం విశేషం. 

24
2015 టాప్‌ గ్రాసర్‌గా సంక్రాంతికి వస్తున్నాం

ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లని రాబట్టిన చిత్రంగా ఇప్పటి వరకు `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ఉంది. వెంకటేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలైంది. ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కిన సినిమా కావడంతో ఆడియెన్స్ బాగా చూశారు. పైగా పండగ సమయంలో వచ్చిన సినిమా కావడంతో ఆ ఆదరణ మరింత పెరిగింది. ఈ సినిమాని ఒక సెలబ్రేషన్‌లా చూశారు. ఎంజాయ్‌ చేశారు. వెంకీ కామెడీకి, అనిల్‌ రావిపూడి ఎంటర్‌టైన్‌మెంట్‌ తోడు కావడంతో ఇది ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. అలాగే ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరీ గ్లామర్‌, ఫన్‌ బాగా వర్కౌట్‌ అయ్యింది. దీంతో ఈ మూవీ లాంగ్‌ రన్‌లో మంచి వసూళ్లని రాబట్టింది. సుమారు రూ.255కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. అయితే ఈ మూవీ రూ.300కోట్లు దాటిందన్నారు. కానీ వాస్తవంగా రూ.255 లోపే ఉందని టాక్‌.

34
`సంక్రాంతికి వస్తున్నాం` రికార్డులు బ్రేక్‌ చేసిన ఓజీ

ఇప్పుడు `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ రికార్డులను `ఓజీ` బ్రేక్‌ చేసింది. ఈ మూవీ పది రోజుల్లోనే రూ.280కోట్లు దాటింది. ప్రస్తుతం మంచి వసూళ్లని సాధిస్తూ దూసుకుపోతుంది. మూడు వందల కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. ఆదివారం కలెక్షన్లు బెటర్‌గానే ఉన్నాయట. దీంతో ఈ వారంలోనే ఇది మూడు వందల కోట్లని క్రాస్‌ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ఇప్పటికే ఇది ఈ ఏడాది అత్యధిక వసూళ్లని రాబట్టిన తెలుగు సినిమాని రికార్డు సృష్టించడం విశేషం. చాలా కాలంగా పవన్‌ కళ్యాణ్‌ మూవీస్‌ ఈ నెంబర్‌ గేమ్‌లో లేవు. పవన్‌కి సాలిడ్‌ మూవీ పడితే అది ఏ రేంజ్‌లో ఉంటుందో ఈ చిత్రం చూపించింది. ఈ వారం రోజులపాటు `ఓజీ` బాగానే ఆడే అవకాశం ఉంది. అదే సమయంలో బిజినెస్‌ పరంగానూ ఇది బ్రేక్‌ ఈవెన్‌ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల బ్రేక్‌ ఈవెన్‌ దాటి సేఫ్‌లోకి వెళ్లింది. ఈ వారంలో ఓజీ అన్ని చోట్ల లాభాల్లోకి వెళ్తుందని సమాచారం. 

44
గ్యాంగ్‌ స్టర్‌గా అదరగొడుతున్న పవన్‌

సుజీత్‌ దర్శకత్వంలో రూపొందిన `ఓజీ`లో పవన్‌కి జోడీగా ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించింది. ప్రకాష్‌ రాజ్‌, ఇమ్రాన్‌ హష్మి, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ముంబయి గ్యాంగ్‌ స్టర్‌ కథతో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో గ్యాంగ్‌ స్టర్‌గా పవన్‌ అదరగొట్టారు. తన స్టయిలీష్‌ నటనతో, యాక్షన్‌తో మెప్పించారు. దీనికితోడు తమన్‌ సంగీతం యాడ్‌ కావడంతో మూవీ వేరే స్థాయికి వెళ్లింది. ఆద్యంతం ఆకట్టుకుంది. ఫ్యాన్స్ బాగా ఎంజాయ్‌ చేశారు. మాస్‌ ఆడియెన్స్ ని కూడా ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే లాంగ్‌ రన్‌ కంటిన్యూ అవుతుంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. సుమారు రూ.250కోట్ల బడ్జెట్‌ అయ్యింది. రూ.175కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌తో విడుదలైన ఈ మూవీ త్వరలోనే బ్రేక్‌ ఈవెన్‌ కాబోతుందని సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories