నాగ్ అశ్విన్ 'కల్కి 2' స్క్రిప్ట్‌పై పని చేస్తున్నారు, ఇది భైరవ మరియు కర్ణ పాత్రలపై దృష్టి పెడుతుంది. ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువగా ఉంటుందని, సినిమా ఈ సంవత్సరం చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
గత సంవత్సరం రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో అభిమానులు ‘కల్కి2’ (Kalki2) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా పార్ట్-2పై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు.
25
Kalki 2 will be about Bhairava/Karna: Says Nag Ashwin in telugu
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ... "ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అసలు ప్రాజెక్ట్-K అంటే ఏంటి అనే దగ్గరే ఉన్నాం. అది పూర్తయిన దాని బట్టి షూటింగ్ మొదలు పెడతాం.
ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే ప్రయత్నం చేస్తాం. ‘కల్కి’లో మహాభారతం నేపథ్యాన్ని సెట్ చేసుకుని, సుమతి, అశ్వత్థామ పాత్రలను డిజైన్ చేసుకుని ఇక్కడి వరకూ వచ్చాం.
35
Kalki 2 will be about Bhairava/Karna: Says Nag Ashwin in telugu
ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ పార్ట్2లో కచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భైరవ, కర్ణ యాంగిల్‌లోనే కథ సాగుతుంది. రెండో భాగంలో వీటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది.
ఇందుకు చాలా వర్క్ చేయాల్సి ఉంది. విడుదల తేదీపై ప్రస్తుతం స్పందించలేను. ఇప్పటివరకూ ఎవరూ ప్రయత్నించని కాన్సెప్ట్‌లనే ఎంచుకుని సినిమాలు చేశా" - అన్నారు నాగ్ అశ్విన్.
45
Kalki 2 will be about Bhairava/Karna: Says Nag Ashwin in telugu
ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి.
సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ త్వరలోనే మొదలుకానుంది. ఇది కాకుండా ప్రశాంత్ నీల్‌తో ‘సలార్2: శౌర్యంగ పర్వం’, ప్రశాంత్ వర్మతో ఓ మూవీ చేయనున్నారు. ‘స్పిరిట్’ మూవీ స్క్రిప్ట్ లాక్ అయింది.
55
Kalki 2 will be about Bhairava/Karna: Says Nag Ashwin in telugu
వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు సందీప్ భావిస్తున్నారు. అందుకు ప్రభాస్‌ను వరుస డేట్స్ అడిగినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, సినిమా పూర్తయ్యే వరకూ మరో మూవీకి వెళ్లకూడదని కండీషన్ పెట్టారట.
ఎంత వేగంగా తీసినా ఈ ఏడాది చివరి నాటికి కానీ, ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి బయట పడలేరు. ఈలోగా నాగ్ అశ్విన్ ‘కల్కి2’ ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకోవడంతో పాటు, పార్ట్2లో ఇతర పాత్రలకు సంబంధించి కొంత షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు.