పవన్‌, నాగబాబు, రామ్‌చరణ్‌, వైష్ణవ్‌.. చిరు బర్త్ డే, రాఖీ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. పండగ అంటే ఇది కదా!

Published : Aug 22, 2021, 08:23 PM ISTUpdated : Aug 22, 2021, 10:43 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, రామ్‌చరణ్‌, సాయితేజ్‌ ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై సందడి చేశారు.   

PREV
112
పవన్‌, నాగబాబు, రామ్‌చరణ్‌, వైష్ణవ్‌.. చిరు బర్త్ డే, రాఖీ వేడుకల్లో  మెగా ఫ్యామిలీ.. పండగ అంటే ఇది కదా!

చిరంజీవి పుట్టిన రోజు, రాఖీ పండుగ ఒకే రోజు రావడంతో మెగా ఫ్యామిలీ సంబరాలు అంబరాన్నంటాయి. మెగా ఫ్యామిలీ మొత్తం చిరంజీవి ఇంటికి చేరింది. దీంతో సందడి పీక్‌లోకి వెళ్లింది. పవన్‌ కళ్యాణ్‌ సైతం చిరు ఇంటికి వచ్చారు. అన్నయ్యకి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్‌ తెలిపారు. అదే సమయంలో వారి సిస్టర్స్ సైతం వచ్చి రాఖీ కట్టారు. దీంతో అన్నా చెల్లెలి అనుబంధానికి ప్రతీకగా మెగా ఫ్యామిలీ నిలిచింది.

212

తన సిస్టర్‌ తనయుడు, మేనల్లుడు, హీరో సాయితేజ్‌ని గట్టిగా హగ్‌ చేసుకుని తన సంతోషాన్ని పంచుకుంటున్న చిరంజీవి. ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

312

తనకు బర్త్ డే విషెస్‌ చెప్పడానికి వచ్చిన `ఉప్పెన` ఫేమ్‌ వైష్ణవ్‌ తేజ్‌తో చిరంజీవి. ఆత్మీయ ఆలింగనంతో ఉబ్బితబ్బిబ్బయిన వైష్ణవ్‌ తేజ్‌. కనువిందుగా నిలుస్తుందీ ఫోటో.

412

తన చెల్లమ్మలతో చిరంజీవి. రాఖీ కట్టిన అనంతరం ఇలా ఫోటోలకు పోజులిచ్చారు. ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ని కూడా చూడొచ్చు.

512

నాగబాబు తనయుడు, హీరో వరుణ్‌ తేజ్‌ని సైతం గట్టిగా హగ్‌ చేసుకుని ముగ్గపై ముద్దు పెడుతున్న చిరంజీవి. ఆద్యంతం ఆకట్టుకుంటుందీ దృశ్యం. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. పెదనాన్నకి బర్త్ డే విషెస్‌ చెబుతూ పొంగిపోతున్నాడు వరుణ్‌.

612

రాఖీ పండుగ కావడంతో చిరంజీవి సిస్టర్స్ తన ఇంటికి చేరారు. వారికి హారతి పట్టి రాఖీ కట్టారు. స్వీట్‌ తినిపించి. ఈ సందర్భంగా వినయంతో చిరు, నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఫోటో వైరల్‌ అవుతుంది.

712

తనకు బర్త్ డే విషెస్‌ చెప్పిన తనయుడు రామ్‌చరణ్‌, ఉపాసనతో మెగాస్టార్‌ చిరంజీవి. ఫ్యామిలీ స్టిల్‌ అభిమానులను కనువిందునిస్తుంది. వైరల్‌ అవుతుంది. వీరి సమక్షంలో చిరు బర్త్ డే వేడుకలు గ్రాంగ్‌గా జరిగాయి.

812

పవన్‌ కళ్యాణ్‌కి రాఖీ కట్టిన అనంతరం ఆశీర్వదిస్తున్న అక్కలు. చిత్రంలో పవన్‌ అమ్మ అంజనాదేవి కూడా ఉన్నారు. మెగా ఫ్యామిలీ ఒకే చోటకు చేరడంతో అభిమానులకు కళ్లసంబురంగా మారింది.

912

`తలైవి` చిత్ర నిర్మాత విష్ణు ఇందూరితో చిరంజీవి. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా విష్ణు ఇందూరి చిరుకి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్‌ తెలియజేశారు.

1012

చిరంజీవి బర్త్ డే వేడుకల్లో భాగంగా ఆయనకు బర్త్ డే విషెస్‌ చెప్పడానికి వచ్చిన మెగా అభిమానులకు అభివాదం తెలియజేస్తున్న చిరంజీవి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయీ పిక్స్.

1112

చిరంజీవి బర్త్ డే వేడుకల్లో భాగంగా ఆయనకు బర్త్ డే విషెస్‌ చెప్పడానికి వచ్చిన మెగా అభిమానులకు అభివాదం తెలియజేస్తున్న చిరంజీవి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయీ పిక్స్.

1212

చిరంజీవి బర్త్ డే వేడుకల్లో భాగంగా ఆయనకు బర్త్ డే విషెస్‌ చెప్పడానికి వచ్చిన మెగా అభిమానులకు అభివాదం తెలియజేస్తున్న చిరంజీవి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయీ పిక్స్.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories