పుష్ప 2 సంఘటనను గుర్తు చేసిన పవన్ క్రేజ్.. సంధ్య థియేటర్ లో హరిహర వీరమల్లు ట్రైలర్ స్క్రీనింగ్ క్యాన్సిల్

Published : Jul 02, 2025, 11:39 PM IST

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "హరి హర వీర మల్లు" ట్రైలర్ రిలీజ్ కి రంగం సిద్ధం అయింది. మరికొన్ని గంటల్లోనే ట్రైలర్ రిలీజ్ కాబోతోంది.

PREV
15

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "హరి హర వీర మల్లు" ట్రైలర్ రిలీజ్ కి రంగం సిద్ధం అయింది. మరికొన్ని గంటల్లోనే ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ లాంచ్ కి నిర్మాతలు భారీ ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ థియేటర్స్ లో ట్రైలర్ ప్రదర్శన ఉండబోతోంది.

25

హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయ్యే ప్రతి థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.అయితే తాజాగా ట్రైలర్ విడుదలలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఈ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రైలర్ జూలై 3వ తేదీ ఉదయం 11:10కి విడుదల కానుంది. అభిమానుల్లో నెలకొన్న విపరీతమైన ఉత్సాహం కారణంగా హైదరాబాద్‌లోని ఆర్డీసీ ఎక్స్ రోడ్స్‌ సమీపంలోని ప్రసిద్ధ సంధ్య థియేటర్‌లో ట్రైలర్ ప్రదర్శనను క్యాన్సిల్ చేశారు.

35

జూలై 2వ తేదీ ఉదయం, ట్రైలర్ స్క్రీనింగ్ కోసం ఎంట్రీ పాస్‌లను తీసుకునేందుకు భారీ సంఖ్యలో అభిమానులు సంధ్య థియేటర్ వద్ద గుమికూడారు. భారీగా వచ్చిన అభిమానులని కంట్రోల్ చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఎంట్రీ పాస్ లకే ఈ రేంజ్ లో హంగామా ఉంటే ఇక ట్రైలర్ ప్రదర్శన సమయంలో అభిమానులు ఇంకెత రచ్చ చేస్తారో ఊహించుకోవచ్చు. 

45

ఈ నేపథ్యంలో, ఇటీవల జరిగిన "పుష్ప 2" ఘటనను గుర్తు చేసుకుంటూ, భద్రత దృష్ట్యా థియేటర్ యాజమాన్యం హరి హర వీర మల్లు ట్రైలర్ స్క్రీనింగ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, నగరంలోని షెడ్యూల్ చేయబడిన ఇతర థియేటర్స్ లలో ట్రైలర్ షో యథావిధిగా కొనసాగుతుంది.

పుష్ప 2 రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వెళ్ళినప్పుడు విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అలాంటి సంఘటన జరగకుండా ముందు జాగ్రత్తగా థియేటర్ యాజమాన్యం, పోలీసులు ట్రైలర్ ప్రదర్శన క్యాన్సిల్ చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.

55

హరిహర వీరమల్లు ట్రైలర్ థియేటర్స్ తో పాటు యూట్యూబ్ లో కూడా రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ ద్వారా సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశముంది.ట్రైలర్ 3 నిమిషాల 1 సెకన్ నిడివితో ఉండబోతోంది. ట్రైలర్ ఫైనల్ కట్ ని పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి వీక్షించారు. ట్రైలర్ లో ఎలివేషన్ సీన్లు, పొలిటికల్ పంచ్ లు అదిరిపోయినట్లు టాక్. 

Read more Photos on
click me!

Recommended Stories