సావిత్రి ఇంట్లో ఉండి వేల కోట్లు సంపాదించిన సెలబ్రిటీ ఎవరో తెలుసా? ఆ ఒక్క సెంటిమెంట్‌తో కుబేరుడు

Published : Jul 02, 2025, 09:04 PM IST

సావిత్రి కారణంగా ఎంతో మంది బాగుపడ్డారు. ఆమె ఎంతో మందికి సాయం చేసింది. ఓ వ్యక్తి ఏకంగా ఆమె ఇంట్లో ఉండి వేల కోట్లు సంపాదించాడు. ఆ కథేంటో చూద్దాం. 

PREV
15
మహానటిగా నిలిచిపోయిన సావిత్రి

మహానటి సావిత్రి తెలుగు సినిమాపై, సౌత్‌ సినిమాపై వేసిన ముద్ర అంతా ఇంతా కాదు. ఆమె మన ముందు లేకపోయినా, ఆమె సినిమాలు అలరిస్తూనే ఉన్నాయి. నటిగా సినిమాలతోనే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ దానధర్మాలతోనూ ఆమె ఎంతో మందికి సహాయం చేసింది. 

ఆమె ఆస్తులు పొంది బాగుపడ్డవాళ్లు, కోట్లు సంపాదించిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం సావిత్రి ఇంట్లో ఉండి వేల కోట్ల అధిపతిగా ఎదిగాడు. ఆయన ఎవరనేది చూస్తే.

25
సావిత్రి ఆస్తులు

సావిత్రి కూతురుగా విజయ చాముండేశ్వరి తాను స్వయంగా అనుభవించిన విషయాలను పంచుకుంది. అందులో భాగంగా సావిత్రి ఆస్తుల గురించి ప్రస్తావన తెచ్చింది. ఆ ఆస్తులు ఏమయ్యాయో చెప్పింది. 

ఎవరు ఎలా ఎదిగారో తెలిపింది. ఎవరు ఎలాంటి మోసాలు చేశారో తెలిపింది. సావిత్రి కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు పారితోషికం లక్షల్లో డబ్బు వచ్చేదట. అప్పుడు వ్యాపారాలు లేకపోవడంతో ల్యాండ్‌లు, ఇళ్లు కొనిపెట్టిందట. 

అలా చాలా ఇళ్లు కొన్నదట సావిత్రి. ఎన్ని ఆస్తులు కొన్నదో ఆమెకే తెలియదు. చెన్నైలోని హబీబుల్లా రోడ్డులో మూడు ఇళ్లు, కొడైకెనాల్‌లో ఓ ఇళ్లు, హైదరాబాద్‌లోని యూసఫ్‌ గూడాలో రెండు ఇళ్లు కొన్నదట.

35
సావిత్రి ఆస్తులు బంధువులే దోచుకున్నారా?

తాను ఇంకా చాలా ఆస్తులు కూడబెట్టిందని, కానీ అవన్నీ కొందరు కాజేశారని ఛాముండేశ్వరి తెలిపారు. తనతో ఉన్నవాళ్లు, తనకు మంచిగా ఉంటూ ఎంతో మంది వెన్నుపోట్లు పొడిచారని, ఆస్తులన్నీ లాక్కున్నారని తెలిపారు. 

సావిత్రి చాలా ఆస్తులు రిలేటివ్‌ల పేర్లతో కొనిపెట్టిందని, వాటిని వాళ్లే ఆక్యూపై చేసుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. హబీబుల్లా రోడ్డులో మూడు ఇళ్లు ఉన్నాయని, ఓ పెద్ద బంగ్లా ఉండేదని, 

ఐటీ వాళ్లు దాడిలో దాన్ని సీజ్‌ చేశారని, దానికోసం చాలా పోరాడాల్సి వచ్చిందని, ముప్పై ఏళ్లపాటు కేసులు తిరిగినట్టు తెలిపారు. కొన్ని ఆస్తులు అమ్మి ఇన్‌కమ్‌ ట్యాక్స్ కట్టినట్టు తెలిపారు.

45
సావిత్రి ఇంటిని కొన్న లలితా జ్యూవెల్లరీ కిరణ్‌ కుమార్‌

అలా హబీబుల్లా రోడ్డులోని పెద్ద బంగ్లా, పక్కన మూడు ఇళ్లు ఉండేవని, వాటిని కూల్చీ ఓ పెద్ద బిల్గింగ్‌గా కట్టామన్నారు. అయితే పంచుకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని అమ్మేశారట. ఈ క్రమంలో ఆ కొత్త బిల్డింగ్‌ని లలితా జ్యూవెల్లరీ హోనర్‌ కిరణ్‌ కి అమ్మేశారట. 

ఆయన అంతకు ముందే చాలా కాలంగా ఆ ఇంట్లోనే రెంట్‌కి ఉండేవాడట. అమ్మే సమయంలో అతనే ఆ ఇంటిని తీసుకున్నట్టు తెలిపారు. సావిత్రిగారిని ఆయన ఆరాధించే వారట. ఆమెని ఓ సెంటిమెంట్‌గా భావించేవారట. ఆ ఇంటిని అమ్మాలనుకున్నప్పుడు తనే తీసుకున్నాడట. 

అందులో సావిత్రికి సంబంధించిన పెద్ద ఫోటో ఉండేదని, ఇప్పటికీ దాన్ని అలానే ఉంచుకున్నాడని, ఆ ఫోటో రూపంలో సావిత్రి తన ఇంట్లోనే ఉందని అతను ఫీలవుతాడని తెలిపారు.

55
సావిత్రి గోల్డ్ సెంటిమెంట్‌లో కోట్లకు ఎదిగిన కిరణ్‌ కుమార్‌

మరోవైపు లలితా జ్యూవెల్లరి కిరణ్‌ సక్సెస్‌ సీక్రెట్‌ చెబుతూ, అమ్మ సావిత్రికి గోల్డ్ అంటే పిచ్చి, ఆమె షోరూమ్ లు ఓపెన్‌ చేసినప్పుడు తొలి బేరం తనే చేసేదని, గోల్డు చైన్స్ ని, గాజులు కొనేదట. బిరువా నిండా నగలే ఉండేవని, 

ఇన్‌కమ్‌ టాక్స్ వాళ్లు మొదట దాని మీదే పడ్డారని, క్లాత్‌లో పెద్ద రాశిలాగా పోసి వాటిని తీసుకెళ్లిపోయారని చెప్పారు. సావిత్రి అమ్మగారు చాలా మందికి నగలు ఇచ్చిందని, వాళ్లు ఎవరూ మళ్లీ తిరిగి ఇవ్వలేదని తెలిపారు. 

అయితే అమ్మకి నగలు, కార్లు అంటే పిచ్చి, లలితా జ్యూవెల్లరి కిరణ్‌కి కూడా నగలు, కార్లు పిచ్చి. ఆయనగోల్డ్ వ్యాపారమే చేశాడు, తమ ఇంటిని కొన్నాక ఆయన వ్యాపారం బాగా కలిసి వచ్చిందని, వేల కోట్లకు ఎదిగాడని తెలిపారు. 

తన భర్తతో కలిసి సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆమె పంచుకున్నారు విజయ చాముండేశ్వరి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories