పవన్ కళ్యాణ్ కి విపరీతంగా నచ్చిన ఆ హీరో సినిమా, విషాదంలో కూడా పక్కకి పిలిచి మరీ..

Published : Jul 28, 2025, 06:30 AM IST

పవన్ కళ్యాణ్ కి ఓ హీరో కామెడీ టైమింగ్ అంటే విపరీతంగా ఇష్టం అట. ఆ విషయాన్ని పవన్ అతడికి స్వయంగా తెలిపారు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం. 

PREV
15
థియేటర్లలో హరిహర వీరమల్లు 

 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. జూలై 24న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. కానీ ఈ చిత్రంలో అభిమానులకు నచ్చే ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ బాగా ఆకట్టుకుంది. 

25
వేణు తొట్టెంపూడి చిత్రాలు

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని హీరో వేణు తొట్టెంపూడి ఇంటర్వ్యూలో వివరించారు. వేణు తొట్టెంపూడి గతంలో టాలీవుడ్ లో హాస్యాన్ని అద్భుతంగా పండించే హీరోగా వెలుగు వెలిగారు. చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, పెళ్ళాం ఊరెళితే లాంటి సూపర్ హిట్ చిత్రాలు వేణు కెరీర్ లో ఉన్నాయి.

35
పవన్ కళ్యాణ్ కి విపరీతంగా నచ్చిన చిత్రం

రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న హీరోగా వేణుకి గుర్తింపు దక్కింది. కానీ గత కొన్నేళ్లుగా వేణు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు మాత్రమే నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కి వేణు తొట్టెంపూడి నటించిన హనుమాన్ జంక్షన్ చిత్రం అంటే విపరీతమైన ఇష్టమట. ఆ మూవీలో వేణు కామెడీని పవన్ కళ్యాణ్ ఎంతో ఎంజాయ్ చేశారట.

45
అల్లు రామలింగయ్య గురించి..

వేణు మాట్లాడుతూ.. నాకు లెజెండ్రీ కమెడియన్ అల్లు రామలింగయ్య తో కళ్యాణ్ రాముడు చిత్రంలో నటించే అవకాశం దక్కింది. అల్లు రామలింగయ్య కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మరణించినప్పుడు నివాళులర్పించడానికి వాళ్ళ ఇంటికి వెళ్లాను. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు.

55
పక్కకి పిలిచి చెప్పిన పవన్

ఆయన నన్ను పక్కకి పిలిచి హనుమాన్ జంక్షన్ మూవీ అంటే తనకు చాలా ఇష్టమని ఆ మూవీలో తన కామెడీ సన్నివేశాలని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఆయన నాతో చెప్పారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నా నటనని అభినందించడంతో చాలా సంతోషంగా అనిపించింది అని వేణు తొట్టెంపూడి అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories