రామ్ చరణ్ దగ్గర వడ్డీకు పవన్ కళ్యాణ్ అప్పు, ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతాం

First Published | Oct 22, 2024, 7:30 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి పవన్ కళ్యాణ్ గతంలో చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ తో తనకున్న అనుబంధాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. చరణ్ కెరీర్ ప్రారంభ దశలో ఆయన నుంచి ఎలాంటి మద్దతు లభించిందో పవన్ వెల్లడించారు.

pawan Kalyan , Ram Charan, chiranjeevi


ఈరోజు టాలీవుడ్‌ ని ఏలుతున్న హీరోల్లో మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ఒకరు.  మెగా స్టార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ ముద్ర వేసుకున్నారు. అలాగే తన బాబాయ్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒకరుగా ఉంటూ, తనూ వాళ్ల నుంచి మద్దతు అందుకుంటున్నారు.

ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో గ్లోబుల్ స్టార్ ఎదిగిన రామ్ చరణ్ అంటే మెగా కాంపౌండ్ లో అందరికీ ఇష్టమే. అందుకు కారణం ఎక్కడా చిన్న వివాదాస్పద కామెంట్ కూడా చేయకపోవటమే. అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ దేశాలు దాటిస్తున్న చరణ్ గురించి ఒకప్పుడు కెరీర్ ప్రారంభ దశలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్  ఇప్పుడు అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు.

pawan Kalyan , Ram Charan, chiranjeevi


రామ్ చరణ్ తొలి చిత్రం చిరుత. 2007, సెప్టెంబర్ 28న చిరుత విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. మెగాస్టర్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన చెర్రీ తొలి సినిమాలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు చిరుత సినిమాతో రామ్ చరణ్ కు వీరాభిమానులయ్యారు.ఈ సినిమాకు దర్శకత్వం వహించింది పూరీ జగన్నాథ్.చిరుత సినిమాతో చెర్రీకి మంచి బ్రేక్ ఇచ్చారు డెరైక్టర్ పూరీ జగన్నాథ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో అప్పుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.


pawan Kalyan , Ram Charan, chiranjeevi


పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...   అప్పట్లో చరణ్ దగ్గర డబ్బులు తీసుకునేవాడ్ని. అందుకు సిగ్గుపడేవాడ్ని కాదు. చిన్నపిల్లాడి దగ్గర తీసుకున్నాను అనిపించేది కాదు. నా సినిమా స్టార్ట్ అయ్యినప్పుడు నాకు అరవింద్ గారు నెలకు ఐదు వేలు ఇచ్చేవారు. సినిమా అయ్యిపోయింది. ఇంక నా దగ్గర డబ్బులు లేవు.

అప్పుడు ఖాళీగా ఉండేవాడ్ని. వదిన దగ్గరకు వెళ్లి డబ్బులు అడగలేను. సినిమా అయ్యిపోయింది. హీరో అయ్యిపోవావు. ఇంకా డబ్బులేంటి అంటారు అనే భయం నాకు. ఒక్కోసారి పది రూపాయలు కూడా ఉండేవి కాదు. ఎవర్ని అడగాలో తెలియదు. అప్పుడు చరణ్ కు పాకెట్ మనీ రెండు వందలు ఇచ్చేవారు. వాడికి ఖర్చు పెట్టుకోవటం తెలియదు కదా. 

pawan Kalyan , Ram Charan, chiranjeevi


దాంతో అడిగి తీసేసుకునేవాడిని. వడ్డీతో పాటు నీకు ఇచ్చేస్తాను అని చెప్పేవాడిని. తర్వాత సినిమాలు చేస్తే బోలుడన్ని డబ్బులు వస్తాయి. అవన్నీ నీకే అనేవాడిని. అది విన్న రామ్ చరణ్ వెంటనే..అప్పుడు నేను ఖర్చు పెట్టుకునే వాడిని కదా. వడ్డీ ఇస్తాడు కదా అని ఇచ్చేసేవాడిని. ఖుషీ సినిమా దాకా అడుగుతూనే ఉన్నారు. డబ్బులు ఎప్పుడు రీ పే చేస్తావని. ఇప్పుడు ఇవ్వను పొండరా అనేవాడిని. ఇప్పటికి ఇవ్వలేదు. ఇంక వాడికి అవసరం లేదు.  వాడు హీరో అయ్యిపోయాడు అంటూ సరదాగా గత విషయాలు చెప్పుకొచ్చారు  పవన్ కళ్యాణ్. 

Ram charan RRR


ఇక చిన్నప్పటి నుంచి నేను చూసిన రామ్ చరణ్..నాకు ఇప్పటికి చిన్నగానే కనపడతాడు. వాడు హీరో చేస్తున్నాడు. జగన్ దర్శకత్వంలో , దత్తుగారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనగానే ఆనందం వేసింది. వీడు హీరో అయ్యిపోయాడా అప్పుడే అనిపించింది అంచూ చరణ్ గురించి ప్రేమగా చెప్తారు పవన్. 
  

‘ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్‌ అంటే పవన్ కు ఎప్పుడూ సానుకూల అభిప్రాయమే ఉంది. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్.. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడని,. పెద్దలు, అనుభవజ్ఞుల పట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు.

కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడని పవన్ అంటారు. అలాగే ఆ లక్షణాలే  అతడికి శ్రీరామ రక్షగా నిలుస్తాయి, మరింత ఉన్నత స్థాయికి ఎదగటానికి దోహదపడతాయి చెప్తూంటారు. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్ తనకు ఎంతో ఇష్టమని పవన్ కళ్యాణ్ చెప్తూంటారు.
 

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తున్న విషయం తెలిసిందే. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.పొలిటికల్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

మరోవైపు ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లో చరణ్‌ నటిస్తున్నారు. ఆర్‌సీ 16 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.

Latest Videos

click me!