ప్రేరణ అసలు రూపం బయటపెడుతున్న కంటెస్టెంట్లు, అందరి టార్గెట్‌ ఆమెనే, నామినేషన్‌లో హైలైట్‌ అదే

First Published | Oct 22, 2024, 12:17 AM IST

మణికంఠ ఎలిమినేట్‌ అయిన తర్వాత ఇప్పుడు హౌజ్‌ మేట్స్ అంతా కలిసి ప్రేరణని టార్గెట్‌ చేశారు. నామినేషన్లలో ఆమెని విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఏడో వారం నాగమణికంఠ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. వచ్చిన రోజే అంతా కలిసి ఆయన్ని ఇంటి నుంచి పంపించేయాలి అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు తానే స్వయంగా బిగ్‌ బాస్‌ హౌజ్‌ని వదిలేశాడు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పింది ఆయన బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వెళ్తున్నట్టు తెలిపారు. స్వయంగా ఎలిమినేట్‌ అయ్యాడు. ఈ రకంగా గౌతమ్‌కి బిగ్‌ బాస్‌ హౌజ్‌లో లైఫ్‌ ఇచ్చాడు మణికంఠ. 

ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఈ వారం హౌజ్‌ నుంచి ఎవరు బయటకు వెళ్తారనేదానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా సాగుతుందనే విషయం తెలిసిందే. హౌజ్‌లో బాగా ఎలివేట్‌, హైలై్‌ట్‌గా నిలిచే ఎపిసోడ్‌ అంటేనే నామినేషన్ల ప్రక్రియ. ఎనిమిదో వారం నామినేషన్లలో కొండలు పగల కొట్టి నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. అయితే మెగా చీఫ్‌ అయిన కారణంగా గౌతమ్‌కి ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. దీన్ని ఉపయోగించి ఆయన ఓ కంటెస్టెంట్‌ ని నామినేట్‌ నుంచి దూరంగా ఉండే అవకాశాన్ని కల్పించారు. ఆ కంటెస్టెంట్‌ని నామినేట్‌ చేస్తే ప్రైజ్‌ మనీ నుంచి 50వేలు తగ్గుతాయి. చీప్‌ గౌతమ్‌.. అందుకు హరితేజని ఎంపిక చేశారు. ఆమెని నామినేట్‌ చేస్తే యాభై వేలు తగ్గిపోతాయి. 
 


ఇక నామినేషన్ల లో విష్ణు ప్రియా.. ప్రేరణ, నిఖిల్‌ని నామినేట్‌ చేసింది. ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రేరణ చెప్పే విధానం, ఆమె ఎక్స్ ప్రెషన్స్ చాలా ఇబ్బందిగా ఉంటుందని, రాష్‌గా ఉంటుందని, దాన్ని తగ్గించుకోవాలని తెలిపింది. నిఖిల్‌.. హీరో నుంచి జీరో అయ్యాడని, ఆట మెరుగుపడాలని తెలిపింది. అనంతరం రోహిణి.. నిఖిల్‌, పృథ్వీలను నామినేట్‌ చేసింది. టాస్క్ లో డిఫెండ్‌ చేసే క్రమంలో చాలా హార్డ్ గా రియాక్ట్ అయ్యావని అది ఇతరులకు ఇబ్బందిగా ఉందని తెలిపింది. పృథ్వీరాజ్‌ గేమ్‌ల్లో కనిపిస్తాడు, తప్ప హౌజ్‌లో  పెద్దగా ఉన్నట్టే అనిపించదని, అక్కడ మాట్లాడాలని తెలిపింది. ఈ క్రమంలో ఈఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పృథ్వీ.. ప్రేరణ, రోహిణిలను నామినేట్‌ చేశాడు. ప్రేరణ రియాక్షన్‌ హార్డ్ గా ఉంటుందని చెప్పాడు. రోహిణిపై రివేంజ్‌ నామినేషన్‌ వేశాడు. నయనీ పావని.. మెహబూబ్‌, నిఖిల్‌లను నామినేట్‌ చేసింది.

హరితేజ.. ప్రేరణ, మెహబూబ్‌లను నామినేట్‌ చేసింది. యష్మి విషయంలో లేట్‌గా రియాక్ట్ అయ్యిందని, ఆమె తీరు బాగాలేదని తెలిపింది. సమాధానం చెప్పే విషయంలో ముఖం పెట్టే తీరు చాలా రాష్ గా ఉంటుందన్నారు. సెల్ఫీష్‌గా ఉన్నాడని, చీఫ్‌గా ఇంట్లో బాధ్యతగా ఉండటం లేదని, దేన్ని పట్టించుకోలేదని తెలిపింది.రెస్పాన్సిబులిటీగా ఉంటే బాగుంటుందని చెప్పింది. ఇక చివరగా నబీల్‌.. సైతం ప్రేరణ, హరితేజలను నామినేట్‌ చేశాడు. ప్రేరణని నామినేట్‌ చేయడంలో సేమ్‌ కారణాలున్నాయి. ఆమె తీరు బాగా ఉండటం లేదంటున్నారు. మరోవైపు హరితేజని కూడా నామినేట్‌ చేయడం విశేషం. ఆమెని చేస్తే యాభై వేలు ప్రైజ్‌ మనీ తగ్గుతున్నా ఇది నా నామినేషన్‌ అంటూ ఆమెని నామినేట్‌ చేశాడు. ఇప్పటి వరకు నిఖిల్‌, ప్రేరణ, మెహబూబ్‌ నామినేట్‌ అయ్యారు. పూర్తీ నామినేషన్‌ ప్రకియ ఇంకా రావాల్సింది. రేపటి ఎపిసోడ్‌లో ఉంది. 

మొత్తంగా సోమవారం ఎపిసోడ్‌లో, నామినేషన్ల ప్రక్రియలో చాలా వరకు ప్రేరణని టార్గెట్‌ చేశారు. అంతకు ముందు మణికంఠని టార్గెట్‌ చేశారు. ఇప్పుడు ప్రేరణని కూడా టార్గెట్‌ చేసినట్టుగా ఉంది. అయితే ఈ క్రమంలో కంటెస్టెంట్లు ప్రేరణ అసలు రూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఆమె ఎలా ఉంటుంది? ఏ విషయం చెప్పాల్సి వచ్చినా, ఎలా రియాక్ట్ అవుతుందనేది వెల్లడించారు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. తను కూడా డిఫెండ్‌ చేసుకునే సమయంలో రియాక్ట్ అయిన తీరు కూడా కాస్త హార్డ్ గానే ఉంది. ఇదిలా ఉంటే నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో ప్రస్తుతం అవినాష్‌, రోహిణి, హరితేజ, తేజ, యష్మి, ప్రేరణ, విష్ణు ప్రియా, నిఖిల్‌, పృథ్వీరాజ్‌, గంగవ్వ, నయని పావని, మెహబూబ్‌, నబీల్‌, గౌతమ్‌ కృష్ణ ఉన్న విషయం తెలిసిందే.

Latest Videos

click me!