తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎలా అయితే తెలుగు సినిమాని శాషించారో, లెజెండరీగా వెలుగొందారో `కన్నడ కంఠీరవ` డా రాజ్ కుమార్ కూడా కన్నడ చిత్ర పరిశ్రమని కొన్నేళ్లపాటు ఏలారు. కన్నడ చిత్ర పరిశ్రమకి ఖ్యాతిని తీసుకొచ్చారు. కన్నడ సాంస్కృతికి ఒక చిహ్నంగా నిలిచారు. బహుముఖ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. నాలుగున్నర దశాబ్దాల కెరీర్‌లో 200సినిమాలు చేశారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేశారు.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శాండల్ వుడ్ లెజెండ్‌గా నిలిచిన ఆయన తెలుగులో సినిమా చేశారు. తన కెరీర్ మొత్తం మరే భాషలోనూ ఆయన సినిమాలు చేయలేదు. కేవలం కన్నడకే పరిమితమయ్యారు. అలాంటిది ఆయన తెలుగులో ఒక సినిమా చేయడం విశేషం. ఒకే ఒక్క తెలుగు మూవీలో మెరిశారు. అది కూడా కన్నడలో ఆయనే నటించిన సినిమాకి రీమేక్ కావడం మరో విశేషం. కన్నడలోనే కాదు, తెలుగులోనూ అది బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. కొన్ని విషయాల్లో అది సంచలనంగా మారింది. మరి ఆ సినిమా ఏంటి? దాని ప్రత్యేకత ఏంటనేది చూస్తే,
డా రాజ్ కుమార్ నటించిన ఏకైక తెలుగు సినిమా `కాళహస్తి మహాత్యం`. భక్తి ప్రధానంగా రూపొందిన చిత్రమిది. భక్త కన్నప్ప జీవితం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ మూవీకి హెచ్ ఎల్ ఎన్ సిన్హా దర్శకత్వం వహించారు. ఇందులో రాజకుమార్ హీరో. ఆయనతోపాటు మాలతి, రతన్, కుషల కుమారి, ముదిగొండ లింగమూర్తి, కుమారి, పద్మనాభం, హెచ్ ఆర్ రామచంద్ర శాస్త్రి, రుశ్యేంద్రమని, రాజ సులోచన నటించారు. సీఆర్ బసవరాజు, గుబ్బి వీరన్న నిర్మించారు. సినిమా పూర్తి మ్యూజికల్ గా తెరకెక్కించారు. సినిమా కథ మొత్తం పాటలు, పద్యాల రూపంలోనే ఉండటం విశేషం. అప్పట్లో భక్తిరసా చిత్రాలు చాలా వరకు ఇలానే తీసేవారు. అలాగే ఈ మూవీని తెరకెక్కించారు.
ఈ సినిమాలో మొత్తం 16 పాటలున్నాయి. ఆర్ గోవర్థనం, ఆర్ సుదర్శనం సంగీతం అందించారు. ఏ ఎం రాజా, ఎం ఎల్ వసంతకుమారి, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల, టీఎస్ భగవతి పాటలు ఆలపించారు. ఉన్న కొన్ని సంభాషణలను తోలేటి వెంకటరెడ్డి రాశారు. ఈ సినిమా 1954 నవంబర్ 12న విడుదలైంది. చాలా సెంటర్లలో వంద రోజులు ఆడింది. మ్యూజిక్ హిట్‌గా నిలిచింది. ఆ పద్యాలకు, పాటలకు ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ సినిమా రాజ్‌కుమార్‌కి హీరోగా తొలి సినిమా కావడం విశేషం. కన్నడలో ఇది `బేడర కన్నప్ప` పేరుతో తెరకెక్కింది. ఈ సినిమాతోనే ఆయన హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. అదే సినిమా తెలుగులో రీమేక్ కావడం విశేషం. ఇలా తన ఫస్ట్ సినిమాతోనే అటు కన్నడ, ఇటు తెలుగు ఆడియెన్స్ ని అలరించారు రాజ్‌కుమార్. కానీ ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు.
రాజ్ కుమార్ కొడుకులు పునీత్ రాజ్‌కుమార్, శివరాజ్ కుమార్ కన్నడ నాట సూపర్ స్టార్స్ గా రాణించిన విసయం తెలిసిందే. కన్నడ పవర్ స్టార్‌గా పునీత్ రాజ్ కుమార్ రాణించారు. ఆయన రెండేళ్ల క్రితం గుండెపోటుతో కన్నుమూశారు. శివరాజ్ కుమార్ ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఆయన తెలుగులోనూ అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య `గౌతమిపుత్ర శాతకర్ణి`లో గెస్ట్ రోల్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్‌తో `ఆర్‌సీ16`లో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. బుచ్చిబాబు దీనికి దర్శకుడు.
read more: `ఈశ్వర్` సినిమాని మొదట ఏ హీరోతో చేయాలనుకున్నారో తెలుసా? ప్రభాస్ ని కూడా కాదని మరో హీరోకి