Korean Kanakaraju 5 Days Collections: స్లో అయిన కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ సినిమా రాబట్టింది ఇదేనా?

Published : Aug 12, 2026, 09:57 AM IST

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `కొరియన్‌ కనకరాజు`. ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా రన్‌ అవుతుంది. మరి ఐదు రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీకి కలెక్షన్లు ఎంత వచ్చాయనేది చూస్తే.

PREV
14
ఎట్టకేలకు హిట్‌ కొట్టిన కొరియన్‌ కనకరాజు

వరుణ్‌ తేజ్‌కి హిట్‌ లేక చాలా కాలం అవుతుంది. `తొలి ప్రేమ` తర్వాత ఒక్క సినిమా కూడా ఆడలేదు. వరుసగా పరాజయాలు చవి చూశారు. ఇన్నాళ్లపాటు ఆయన స్ట్రగుల్‌ అయ్యాడు. కానీ ఇన్నాళ్ల కష్టం, స్ట్రగుల్స్ అన్నీ పోయాయి. `కొరియన్‌ కనకరాజు`తో ఆయన ఎట్టకేలకు హిట్‌ కొట్టాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. రితిక నాయక్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సత్య, సునీల్‌, మురళీధర్‌ గౌడ్‌ కీలక పాత్రలు పోషించారు. యూవీక్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైన విషయం తెలిసిందే.

24
సత్య కామెడీ హైలైట్‌గా కొరియన్‌ కనకరాజు

కామెడీ ప్రధానంగా సాగిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యింది. కొంత థ్రిల్లర్‌ ఎలిమెంట్లు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. సత్య కామెడీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. మొత్తంగా వరుణ్‌ తేజ్‌కి హిట్‌ని అందించింది. ఈ మూవీ థియేటర్లో విజయవంతంగా రన్‌ అవుతుంది. అయితే తొలి వీకెండ్‌లోనే ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావడం విశేషం. రూ.38కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీకి నాన్‌ థియేట్రికల్‌గా రూ.26కోట్లు వచ్చాయట. ఓటీటీ, శాటిలైట్‌, ఆడియో రైట్స్ రూపంలో మంచిగానే వచ్చాయి.

34
బ్రేక్‌ ఈవెన్‌ అయిన కొరియన్‌ కనకరాజు

ఇక థియేట్రికల్‌గా దీనికి రూ.12కోట్ల బిజినెస్‌ అయ్యింది. మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ దాటింది. ఇప్పుడు లాభాల్లో వెళ్తుంది. సినిమా విడుదలై ఐదు రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు దీనికి నలభై కోట్లు దాటినట్టు చిత్ర బృందం చెప్పింది. కానీ సాక్నిల్క్ వంటి ట్రేడ్‌ సైట్ల ప్రకారం ఐదు రోజుల్లో దీనికి రూ.24కోట్లు వచ్చినట్టు సమాచారం. మంగళవారం దీనికి కోటిన్నర మాత్రమే వచ్చాయి. సోమవారంతో పోల్చితే సగమే వచ్చాయి. అంటే 50శాతం కలెక్షన్లు పడిపోయాయి.

44
పడిపోయిన కొరియన్‌ కనకరాజు

`కొరియన్‌ కనకరాజు` మూవీకి ఇండియాలో రూ.19.25కోట్ల గ్రాస్‌, రూ.16.74కోట్ల నెట్‌ వచ్చాయి. ఓవర్సీస్‌లో నాలుగున్నర కోట్లు వచ్చాయి. ఇలా ఈ మూవీకి రూ.13కోట్ల వరకు షేర్‌ వచ్చిందని సమాచారం. టీమ్‌ లెక్కల ప్రకారం దీనికి ఇప్పటికే ఇరవై కోట్ల షేర్‌ దాటింది. అంటే లాభాల్లోనే రన్‌ అవుతుందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో యూవీ క్రియేషన్స్ తీసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా మారిన నేపథ్యంలో ఇప్పుడు `కొరియన్‌ కనకరాజు` మూవీ ఈ బ్యానర్‌కి ఊపిరి పోసిందని చెప్పొచ్చు. అయితే మంగళవారం నుంచి కలెక్షన్లు బాగా తగ్గాయి. ఈ రెండు మూడు రోజులే ఈ సినిమా సత్తా చాటే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కొత్తగా పెద్ద సినిమాలు వస్తున్నాయి. దీంతో ఆ ప్రభావం కొరియన్‌ కనకరాజు పడబోతుందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories