బెంగళూరుకు చెందిన కన్నడ డాక్టర్స్ ఫ్యామిలీలో జన్మించిన ప్రణీత.. 2010లో కన్నడ మూవీ పోర్కితో హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది, తొలి సినిమాతోనే కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హోదాను అందుకుంది. ఇక వెంటనే లేట్ చేయకుండా.. టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈచిన్నది.. ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది. ఇక వరుసగా బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాలతో తెగ హడావిడి చేసింది.