40ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్? ఆమెను గుర్తుపట్టారా!

Published : Jan 31, 2024, 11:53 PM IST

2006లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన హీరోయిన్ ఇన్నేళ్లకు పెళ్లి చేసుకుంటోంది.. తాజాగా ఆమె వెడ్డింగ్ కు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.   

PREV
16
40ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్? ఆమెను గుర్తుపట్టారా!

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా Priyanka Chopra కజిన్ ప్రస్తుతం పెళ్లికి సిద్ధమైంది... ఆమె ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సరసన నటించిన హీరోయినే కావడం విశేషం. 

26

పవన్ కళ్యాణ్ నుంచి 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘బంగారం’. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మనే మీరా చోప్రా Meera Chopra. ఈమె ప్రియాంక చోప్రాకు కజిన్. 

36

తమిళ చిత్రాలతో మీరా చోప్రా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కోలీవుడ్ లో కొన్నేళ్లుగా వరుస చిత్రాలతో సందడి చేసింది. తెలుగులో ‘బంగారం’తో పాటు ‘వాన’, ‘మారో’, ‘గ్రీకు వీరుడు’ వంటి చిత్రాల్లో నటించింది. 
 

46

ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. అయితే మీరా చోప్రా గురించి ఓ న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సీనియర్ నటి 40 ఏళ్ల వయస్సులో పెళ్లికి సిద్ధమైందనే వార్త బాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది.

56

త్వరలో తన మ్యారేజ్ ఉంటుందని, ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమైనట్టు చెప్పినట్టు తెలుస్తోంది. మార్చి నెలలో రాజస్థాన్ వేదికగా వివాహా వేడుక ఘనంగా జరగబోతుందని సమాచారం. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  

66

మీరా చోప్రా చివరిసారిగా జీ5 హిందీ చిత్రం సఫెద్‌లో కనిపించింది. దీనికి ముందు అజయ్ బహ్ల్ నటించిన సెక్షన్ 375 లో నటించి మెప్పించింది. 2015 తర్వాత ఈ ముద్దుగుమ్మ సౌత్ లో పెద్దగా సినిమాలు చేయడం లేదు. 

Read more Photos on
click me!

Recommended Stories