చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన కీర్తి సురేష్... ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలతో అలరిస్తోంది. వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు.
తెలుగు చిత్రం ‘మహానటి’తో ఏకంగా జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్నారు. దీంతో ఇంట్రెస్టింగ్ గా సినిమాల కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ అలరిస్తున్నారు.
ఇదిలా ఉంటే కీర్తి సురేష్ త్వరలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఆ మూవీ గురించి అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ Varun Dhavan సరసన నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
VD18 వర్క్ టైటిల్ తో కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ మూవీ రూపుదిద్దుకుంటోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అట్లీ Atlee ప్రజెంట్ చేస్తుండటం విశేషం. ఈ సినిమా కోసం సౌత్ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే... ఈ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. తాజాగా కీర్తి సురేష్ ఈ మూవీకోసం బ్యూటీఫుల్ శారీలో ఫొటోషూట్ చేసింది. చీరకట్టులో తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అదిరిపోయే స్టిల్స్ తో అట్రాక్ట్ చేసింది.
కీర్తి సురేష్ బాలీవుడ్ లో చేస్తున్న ఈ తొలిచిత్రం మంచి సక్సెస్ ను అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం కీర్తి బ్యూటీఫుల్ స్టిల్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఇక మహానటి సౌత్ లో ‘రివాల్వర్ రీటా’తో పాటు మరిన్ని చిత్రాల్లో నటిస్తోంది.